US Student Visa Slots: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు గుడ్ న్యూస్, వీసా స్లాట్స్ విడుదల

Best Web Hosting Provider In India 2024

US Student Visa Slots: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని భావిస్తున్న విద్యార్ధులకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తీపికబురు చెప్పింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్ ప్రారంభమైనట్టు ప్రకటించారు.

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు మే 31 వరకు స్టూడెంట్ వీసా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యా లయంతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతాలోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో వీసా స్లాట్లను బుక్ చేసుకోవచ్చు.

అమెరికాలో స్టూడెంట్ వీసా జారీలో భాగంగా ఈసారి విస్తృత స్థాయిలో స్లాట్లు విడుదల చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ నెలకు సంబంధించిన స్లాట్లను మే మూడో వారంలో, ఆ తర్వాత జులైకు, అవసరాన్ని బట్టి ఆగస్టు నెల వరకు ఇంటర్వ్యూ తేదీలనూ విడుదల చేస్తారు. విద్యార్ధుల నుంచి అందే దరఖాస్తుల ఆధారంగా తేదీలను కేటాయిస్తారు.

అమెరికాలో రెండు సెమిస్టర్ల విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు ఫాల్ సీజన్ ఏటా ఆగస్టు-సెప్టెంబరులో ప్రారంభం అవు తుంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు దేశంలోని కాన్సులేట్ కార్యాలయాలకు శని, ఆదివారాలు సెలవు. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శని,ఆదివారాలైన మే నెల 19, 26 తేదీల్లో కూడా స్లాట్లు కేటాయించారు.

అక్టోబరులో పర్యాటక వీసాలు…

విద్యార్థుల వీసాల జారీ ప్రక్రియ పూర్తయిన తర్వాత పర్యాటక వీసాలు (బి1, బి2) స్లాట్లు అందుబా టులోకి వస్తాయని రాయబార వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు చివరి వారం లేదా అక్టోబరులో యూఎస్‌ టూరిస్ట్‌ వీసా స్లాట్లు జారీ అవుతాయి.

మరోవైపు వీసాల జారీ ప్రక్రియను మరింత సరళతరం చేసినట్టు భారతదేశంలోని యుఎస్ ఎంబసీ, ట్విట్టర్‌లో క పోస్ట్ చేసింది. సౌకర్యవంతమైన ఇంటర్వ్యూ మినహాయింపు ప్రక్రియను ఉపయోగించి సందర్శకుల వీసా అపాయింట్ మెంట్ బుక్ చేయాలని భావిస్తే కొత్త సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. వీసా ప్రాసెసింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా, న్యూఢిల్లీలో బి 1 / బి 2 ఇంటర్వ్యూ మినహాయింపు ప్రక్రియను ఏకీకృతం చేసినట్టు వెల్లడించారు.

అమెరికా రాయబార కార్యాలయం బీ1/బీ2 ఇంటర్వ్యూ మినహాయింపు ప్రక్రియను ఏకీకృతం చేసింది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ఫారాలను దేశంలోని ఐదు వీసా అప్లికేషన్ సెంటర్లలో ఎక్కడైనా ఉచితంగా సమర్పించవచ్చు. ప్రతి దరఖాస్తుకు 850 రూపాయల రుసుముతో అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, కొచ్చిన్, జలంధర్, పూణేలో ఉన్న ఏదైనా యుఎస్ డాక్యుమెంట్ డ్రాప్ ఆఫ్ సెంటర్లలో పత్రాలను అందించవచ్చని ప్రకటించింది.

“దేశంలోని ఐదు వీసా అప్లికేషన్ సెంటర్లలో మీ దరఖాస్తు ఫారాలను ఉచితంగా సమర్పించవచ్చు. అలా చేయలేని వారికి ఒక్కో దరఖాస్తుకు రూ.850 రుసుము చెల్లించి అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, కొచ్చిన్, జలంధర్, పుణెలో ఉన్న యూఎస్‌ డాక్యుమెంట్ డ్రాప్ ఆఫ్ సెంటర్లలో డాక్యుమెంట్లను అందచేయొచ్చని ప్రకటించారు.

విజిటర్ వీసా కోసం చూస్తున్న ఇంటర్వ్యూ మినహాయింపు అర్హత కలిగిన దరఖాస్తు దారులకు న్యూఢిల్లీలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటాయని, ఏకీకృత సర్వీసుల కారణంగా చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబైలలో విజిటర్ వీసాలకు పరిమిత ఇంటర్వ్యూ మినహాయింపు అపాయింట్మెంట్లు అందుబాటులో ఉంటాయని ఎంబసీ తెలిపింది. సందర్శకుల వీసా కోసం చూస్తున్న వారిలో ఇంటర్వ్యూ మినహాయింపు-అర్హత కలిగిన దరఖాస్తుదారులకు న్యూఢిల్లీలో అపాయింట్మెంట్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.

ఇంటర్వ్యూ మినహాయింపు ప్రక్రియ పొందడానికి దరఖాస్తుదారుడు అనర్హులని తేలితే తప్ప న్యూఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని తెలిపింది.

గత ఏడాది 14లక్షల వీసాలు…

భారతదేశంలోని యుఎస్ కాన్సులర్ బృందాలు 2023 లో రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల యుఎస్ వీసాలను ప్రాసెస్ చేశారు. ఇది గతంలో కంటే ఎక్కువని సందర్శకుల వీసా అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని 75 శాతం తగ్గించినట్టు వెల్లడించాు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది అమెరికా వీసా దరఖాస్తుదారుల్లో ఒకరికి భారతీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.

2022తో పోలిస్తే 60 శాతం దరఖాస్తులు పెరగడంతో అన్ని వీసా క్లాసుల్లో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది అమెరికా వీసా దరఖాస్తుదారుల్లో ఒకరు భారతీయులు ఉన్నారు.

విజిటర్ వీసాలు (బి 1 / బి 2) దాదాపు 7లక్షల వరకు ఉన్నాయి. గతంతో పోలిస్తే వీసాల కోసం ఎదురు చూడాల్సిన సమయాన్ని గణనీయంగా తగ్గించినట్టు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Nri NewsUsUs VisaH1b VisaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsUs Education Visa
Source / Credits

Best Web Hosting Provider In India 2024