Best Web Hosting Provider In India 2024
Brahmamudi May 8th Episode: రాజ్ బిడ్డకు తండ్రి ఎవరన్నది కనిపెట్టి భర్త నిర్ధోషిత్వాన్ని అందరి ముందు నిరూపించాలని అనుకుంటుంది కావ్య. కానీ ఆ బిడ్డకు తండ్రి సుభాష్ అని తెలిసి షాకవుతుంది. నిజం కోసం తాను చేసిన పోరాటం వృథాగా మారడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజం బయటపెడితే అత్తయ్య అపర్ణ ప్రాణాలతో మిగలదని భయపడుతుంది కావ్య. నిజం బయటపడకుండా, రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా సమస్యకు నువ్వే నాకు దారి చూపించు అని దేవుడిని వేడుకుంటుంది కావ్య.
ధాన్యలక్ష్మి ఫైర్…
బిడ్డ ఎవరో చెప్పడానికి రాజ్‌కు అపర్ణ ఇచ్చిన గడువుకు ఒకే రోజు సమయం ఉండటంతో ఆమె ఆజ్ఞ ప్రకారం రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడా? లేదంటే నిజం చెబుతాడా అన్నది దుగ్గిరాల కుటుంబసభ్యుల్లో ఆసక్తికరంగా మారుతుంది. ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రకాశం ఆఫీస్ మానేసి ఇంటిదగ్గరే ఉంటాడు. భర్తపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా పర్వాలేదని భర్తతో అంటుంది.
కళ్యాణ్ తప్పు చేస్తే…
రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడనే బాధ కొంచెం కూడా నీకు లేదా భార్యను అడుగుతాడు ప్రకాశం. తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించకతప్పదని రాజ్ చెప్పేవాడు. ఇప్పుడు రాజ్ తప్పు చేశాడు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్లడంలో తప్పులేదని భర్తకు ధాన్యలక్ష్మి బదులిస్తుంది.
ఒకవేళ కళ్యాణ్ ఇలాంటి తప్పు చేస్తే ఇంట్లో నుంచి వెళ్లగొడతావా అని ధాన్యలక్ష్మిని ప్రకాశం అడుగుతాడు. తన కొడుకు అలాంటి తప్పు ఎప్పటికీ చేయడని ధాన్యలక్ష్మి తడబడుతూ చెబుతుంది. కళ్యాణ్ టాపిక్ రాగానే భర్తతో మాటలు కట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కావ్యకు అప్పు సపోర్ట్…
రాజ్‌పై పడ్డ నింద నిజం కాదని తెలిసి కూడా కావ్య మౌనంగా ఉండటంపై అప్పు కోప్పుడుతుంది. సుభాష్ చేసిన తప్పును అందరికి చెప్పమని అక్కను నిలదీస్తుంది. ఆ నిజం బయటపెడితే అత్తయ్య ప్రాణాలతో ఉండలేదని అప్పుకు సమాధానమిస్తుంది కావ్య. నిజం తెలిసి కూడా భర్త ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఇప్పుడు అర్థమవుతుంది.
కొన్ని తప్పులను ఎప్పటికీ సరిచేయలేం. జీవితాంతం వాటిని మోయాల్సిందేనని ఎమోషనల్ అవుతుంది కావ్య. ఆ అవకాశం కూడా నీకు లేదని, బిడ్డ తల్లి వచ్చి ఏదో ఒక రోజు నిజం చెబుతుందేమోనని అప్పు భయపడుతుంది. ఆమెకు అవకాశం ఇవ్వకుండా తానే ఓ నిర్ణయం తీసుకున్నట్లు, అదేమిటో చెప్పనని, నువ్వే తెలుసుకోమని అప్పుతో అంటుంది కావ్య. నువ్వు తప్పు చేసిన తోడుగానే ఉంటానని కావ్యకు మాటిస్తుంది అప్పు.
దోషిని చేసే సాక్ష్యం…
సుభాష్ బిడ్డ తండ్రి అని చెప్పడానికి సాక్ష్యంగా ఉన్న పెన్‌డ్రైవ్‌ను కావ్యకు ఇస్తుంది అప్పు. ఆ పెన్‌డ్రైవ్‌ను పగలగొట్టేస్తుంది కావ్య. ఒక మనిషిని దోషిని చేసి, మరో మనిషి ప్రాణాలు తీసే సాక్ష్యం నాకు అక్కరలేదని అప్పుతో అంటుంది కావ్య.
రుద్రాణి ప్లాన్…
రాజ్ గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ అపర్ణ కనిపిస్తుంది. ఆమెపై రుద్రాణి, రాహుల్ సెటైర్స్‌వేస్తారు. కొడుకును ఎలా కాపాడుకోవాలని అపర్ణ ఆలోచిస్తున్నట్లుందని రుద్రాణి అంటుంది. ఒకవేళ అపర్ణ మాట మార్చేసి కొడుకును ఇంట్లో ఉండమని చెప్పినా తాను ఊరుకోనని రుద్రాణి అంటుంది. బిడ్డ తల్లిని తీసుకురమ్మని రాజ్‌ను ఇరికిస్తానని అంటుంది. తనపై నేరం పడకుండా రాజ్‌ను ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించేయడానికి ప్లాన్ రెడీ చేస్తుంది.
సేట్ వార్నింగ్….
రాహుల్‌కు అప్పు ఇచ్చిన సేట్ ఫోన్ చేసి తన డబ్బును తిరిగి ఇచ్చేయమని రుద్రాణిని బెదిరిస్తాడు. డబ్బు ఇవ్వకుంటే రెండు రోజుల్లో ఇంటికి వచ్చి ఆస్తి పేపర్స్ తాకట్టు పెట్టింది రాహుల్ అనే నిజం బయటపెడతానని హెచ్చరిస్తాడు. డబ్బులు పోయాయంటూ సేట్‌తో రుద్రాణి మాట్లాడటం స్వప్న వింటుంది.
డబ్బు పోయిందని సెలైంట్‌గా ఉండొద్దని, ఇంట్లో అందరికి ఈ విషయం చెబుతామని రుద్రాణిని ఆట ఆడుకుంటుంది. అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్వప్న చెబుతుంది. స్వప్ననే డబ్బు కొట్టేసిందని తెలిసి కూడా ఆమెను ఏం అనలేక లోలోన కోపంతో రగిలిపోతుంది రుద్రాణి.
ఆ డబ్బును నేనే ఎలాగోలా సర్ధుబాటు చేస్తానని, దాని గురించి ఇంట్లో ఎవరికి చెప్పొద్దని స్వప్నను బతిమిలాడుతుంది రుద్రాణి. డబ్బు గురించి మీరు వదిలేసినా నేను వదలనని స్వప్న అనడంతో రుద్రాణి భయపడుతుంది.
రాజ్ మంచితనం…
తండ్రి గురించి ఎన్నో అవవమానాలు భరిస్తున్న రాజ్ మంచితనం చూసి కావ్య మురిసిపోతుంది. రాజ్‌నే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావని కావ్యను అడుగుతాడు రాజ్. మా ఆయనను నేను చూసుకుంటున్నానని కావ్య సమాధానం చెబుతుంది. బాబులో మీ నాన్న పోలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయని భర్తతో అంటుంది కావ్య. బాబుకు తాతగారి పోలికలు వచ్చినట్లున్నాయని చెప్పి రాజ్‌ను తన మాటలతో భయపెడుతుంది కావ్య.
రాజ్ నిశ్చలం….
బిడ్డ తల్లికి ఏం మాట ఇచ్చారో కానీ…ఆ మాట కోసం మీరు ఎన్ని గొడవలు అయినా భరించడం చూస్తుంటే ముచ్చటేస్తుందని భర్తతో అంటుంది. రేపు ఇంట్లో నుంచి వెళ్లిపోతామని తెలిసిన నిశ్చలంగా ఎలా ఉంటున్నారని భర్తను అడుగుతుంది కావ్య. సడెన్‌గా కావ్య తనకు సపోర్ట్ చేయడం చూసి రాజ్ ఆశ్చర్యపోతాడు.
నీ ప్లేస్‌లో స్వప్న, అనామిక ఉంటే ఈ పాటికి భర్తపై పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చేవాళ్లను, నువ్వు మాత్రం నిశ్చలంగా ఎందుకు ఉన్నావో నాకు అర్థం కావడం లేదని భార్యతో అంటాడు రాజ్. నా మనసాక్షి నమ్మిందే నేను చేస్తున్నానని కావ్య అంటుంది.
బాబు బాధ్యత…
గార్డెన్‌లో ఒంటరిగా కూర్చోవడానికి వెళుతూ బాబును చూసుకునే బాధ్యతకు కావ్యకు అప్పగిస్తాడు. బాధ్యతను పంచుకోమని అంటున్నారు. బాబును పెంచుకోమని చెబుతున్నారా? అంటూ భర్తను అడుగుతుంది కావ్య. ఆమె మాటలకు అర్థం కాక రాజ్ అయోమయంలో పడతాడు. టాపిక్ మార్చేసి బాబును రాజ్ దగ్గర నుంచి తీసుకుంటుంది కావ్య.
అపర్ణ నిర్ణయం…
రాజ్ గార్డెన్‌లోకి వెళ్లబోతుండటం చూసి రాజ్‌ను ఆపుతుంది అపర్ణ. బయటకు వెళ్లి వస్తావా? అటు నుంచి అటే వెళతావా అని కొడుకును అడుగుతుంది అపర్ణ. ఆమె ప్రశ్న విని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ షాకవుతారు. అపర్ణ నిర్ణయాన్ని మార్చుకోమని ఇందిరాదేవి, సుభాష్ అంటారు.
కానీ తన నిర్ణయం మార్చుకోనని అపర్ణ అంటుంది. రేపటితో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని తెలిసినా నువ్వు ఎందుకు నిజం చెప్పడం లేదని కొడుకును నిలదీస్తుంది. ఏ బలహీన క్షణంలో తప్పు జరిగిందో మాకు చెప్పు అంటూ రాజ్‌ను ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంది రుద్రాణి.
నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోతా…
రేపు ఉదయం లోగా జరిగింది ఏమిటో, జరగాల్సింది ఏమిటో చెప్పాలని రుద్రాణి ఆర్డర్ వేస్తుంది. లేదంటే తానే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటుంది. బిడ్డ విషయంలో రాజ్ నిజాలు బయటపెట్టకపోతే ఇళ్లు వదిలివెళ్లిపోతానని చెబుతుంది. ఆమె నిర్ణయంతో రాజ్, సుభాష్ షాకవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.