Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu Serial: ధరణి ద్వారా రాజీవ్ బతికే ఉన్నాడనే నిజం తెలుసుకుంటుంది వసుధార. శైలేంద్ర వేసే ప్లాన్లకు వసుధార ఎదురువెళ్లడం చూసి అనుపమ భయపడుతుంది. శైలేంద్ర, రాజీవ్ లాంటి దుర్మార్గులతో పోరాడటం రిస్క్ అని వసుధారతో అంటుంది అనుపమ.
ఆ రాక్షసులతో పోరాడటంలో ఎంత రిస్క్ అయినా భరిస్తానని, ఇది నాకు నేను విధించుకున్న టాస్క్ అని అనుపమకు సమాధానం చెబుతుంది వసుధార. వారు కుట్రలను బయటపెడితేనే మను జైలు నుంచి బయటకు వస్తాడని, అప్పుడే మహేంద్ర, మను కలవగలరని, ఓ కొడుక్కి తండ్రిని పరిచయం చేయగలనని వసుధార అంటుంది.
మనుపై ప్రశంసలు…
మను లాంటి వ్యక్తులు పోలీస్ స్టేషన్లో కాకుండా సమాజంలో ఉంటేనే పది మంది బాగుంటారని వసుధార అంటుంది. రిషి విషయంలో మను తనకు చాలా సపోర్ట్ చేశారని, రాజీవ్ ఇబ్బంది పెట్టినప్పుడల్లా మనునే వచ్చి తనను కాపాడారు అని, నాతో పాటు ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి చేయని తప్పుకు స్టేషన్లో ఉన్నాడని, మనును ఎలాగైనా బయటకు తీసుకొస్తానని అనుపమతో అంటుంది వసుధార.
ప్రాణాలు తీసైనా సరే…
నా ప్రాణాలు అడ్డేసి అయినా, అవసరమైతే శైలేంద్ర, రాజీవ్ ప్రాణాలు తీసి అయిన మనును కాపాడుతానని మహేంద్ర కూడా అంటాడు. ఎంతైనా మీ కొడుకు కదా…మీరు కాకపోతే ఎవరు కాపాడుతారు అని వసుధార నోరు జారుతుంది. ఆ తర్వాత మీ కొడుకులాంటివారు అంటూ మాట మారుస్తుంది. కలిసికట్టుగా మనను కాపాడాలని, మనకు చాలా తక్కువ టైమ్ ఉందని మహేంద్ర టెన్షన్ పడతాడు
రాజీవ్ తో ఫోన్లో శైలేంద్ర మాట్లాడటం ధరణి చూసిందని, ఆ ఫోన్ నంబర్ దొరికితే రాజీవ్ ఎక్కడున్నది ఈజీగా కనిపెట్టవచ్చవని, మనును బయటకు తీసుకురావచ్చని మహేంద్రతో అంటుంది వసుధార.
ధరణి ప్లాన్ రివర్స్…
శైలేంద్ర నిద్రపోతున్నట్లుగా నటిస్తుంటాడు. భర్త నిద్రపోయాడనుకొని రాజీవ్ నంబర్ తెలుసుకోవడానికి శైలేంద్ర ఫోన్ తీస్తుంది ధరణి. భార్య ఫోన్ ముట్టగానే శైలేంద్ర కళ్లు తెరుస్తాడు. ధరణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని తన ఫోన్ ఎందుకు తీశావని, ఫోన్‌తో పనేమిటని నిలదీస్తాడు. తెలివిగా మాట మార్చేస్తుంది ధరణి.
మీరు చాలా రోజులుగా ఎవరో అమ్మాయితో సీక్రెట్‌గా మాట్లాడుతున్నట్లు అనుమానం ఉందని, అందుకే తీశానని భర్తపైనే రివర్స్ ఫైర్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో ఈ రోజే తెలుసుకుంటానని, మర్యాదగా ఫోన్ ఇవ్వమని శైలేంద్రను బెదిరిస్తుంది. అతడు ఫోన్ ఇవ్వకపోవడంతో ఫణీంద్ర, దేవయానిలను గట్టిగా పిలుస్తుంది. ధరణి చేస్తోన్న గొడవకు శైలేంద్ర బెదిరిపోతాడు.
ధరణి డ్రామా…
ధరణి కన్నీళ్లు పెట్టుకుంటూ డ్రామాను రక్తికట్టిస్తుంది. శైలేంద్ర తనకు అన్యాయం చేశాడంటూ, నాకు తెలియకుండా ఎవరెవరికో ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నాడంటూ భర్తపై ఫణీంద్రకు కంప్లైంట్ ఇస్తుంది ధరణి. ఆమె మాటలను నిజమని ఫణీంద్ర నమ్ముతాడు. కొడుకుపై సీరియస్ అవుతాడు. దేవయాని మాత్రం శైలేంద్రను వెనకేసుకొస్తుంది. మీరు అత్తలా కాదు అమ్మలా ఆలోచించిండి అంటూ ధరణి అనడంతో దేవయాని కూడా కరిగిపోతుంది. ఏ అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నావో చెప్పమని కొడుకును నిలదీస్తుంది.
శైలేంద్ర మాటలు నమ్మని దేవయాని…
ధరణి అబద్ధం ఆడుతుందని శైలేంద్ర ఎంత చెప్పిన ఫణీంద్ర, దేవయాని అతడి మాటలను నమ్మరు. మీరు చెబుతుంది నిజమే అయితే మీ ఫోన్ చూపించండి అని భర్త శైలేంద్రను నిలదీస్తుంది ధరణి. తాను ఫోన్ చూపించనని శైలేంద్ర మొండికేస్తాడు. నువ్వు తప్పు చేశావు కాబట్టే ఫోన్ చూపించడం లేదని కొడుకుతో అంటాడు ఫణీంద్ర.
ఫోన్ చూపించిన శైలేంద్ర…
ధరణి ఎంతకు పట్టువీడకపోవడంతో చివరకు శైలేంద్ర ఫోన్ చూపిస్తాడు. కానీ రాజీవ్‌తో మాట్లాడిన కాల్స్, పంపించిన మెసేజ్‌లను శైలేంద్ర తెలివిగా డిలీట్ చేస్తాడు. అది కనిపెడుతుంది ధరణి. మరో అమ్మాయితో మాట్లాడిన కాల్స్, పంపించిన మెసేజ్‌లను భర్త డిలేట్ చేశాడని మరో కొత్త డ్రామా మొదలుపెడుతుంది. శైలేంద్ర తప్పు చేశాడని ఫణీంద్ర, దేవయాని కన్ఫామ్చేస్తారు. ధరణికి అన్యాయం చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇస్తారు.
వసుధార కంగారు…
వసుధారకు ఫోన్ చేస్తుంది ధరణి. రాజీవ్ నంబర్ కోసం శైలేంద్ర ఫోన్ తీసుకున్నానని, కానీ భర్తకు దొరికిపోయానని చెబుతుంది. తెలివిగా తప్పించుకున్న సంగతి చెబుతుంది. రాజీవ్ నంబర్ దొరకడం కష్టమని చెబుతుంది. ఈ విషయంలో తాను ఏం చేయలేనని అంటుంది. రాజీవ్ బతికే ఉన్నాడని నిరూపించేందుకు ఉన్న ఒక్క ఆధారం కూడా దొరక్కపోవడంతో శైలేంద్ర, వసుధార కంగారు పడతారు.