Best Web Hosting Provider In India 2024
Brahma Anandam Movie: టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం లీడ్ రోల్‌లో ఓ కొత్త మూవీ రాబోతోంది. ఈ సినిమా టైటిల్‌ను బుధవారం రివీల్ చేశారు. ఈ సినిమాకు బ్రహ్మ అనందం అనే పేరును ఖరారు చేశారు. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బ్రహ్మానందంతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
ఈ సినిమాలో తండ్రీకొడుకులు తాతామనవళ్లుగా కనిపించబోతున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. బ్రహ్మ ఆనందం మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో వెన్నెలకిషోర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోల్లక్కల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
వీడియో ద్వారా….
బ్రహ్మ ఆనందం మూవీ టైటిల్‌ను ఓ వీడియో ద్వారా డిఫరెంట్‌గా అనౌన్స్‌చేశారు. ఈ వీడియోలో బ్రహ్మానందం, వెన్నెలకిషోర్‌తో పాటు రాజా గౌతమ్ కనిపించారు. వాడికి నువ్వైనా చెప్పరా…సినిమా చేసి పుష్కరం అయ్యింది. ప్రతిస్టోరీ వింటాడు. డెప్త్ లేదు, కాన్సెప్ట్ లేదని ఏదేదో చెబుతుంటాడు అని కొడుకును ఉద్దేశించి వెన్నెలకిషోర్‌తో బ్రహ్మానందం చెబుతూ కనిపించాడు.
ఇవి అన్ని ఉన్న ప్రాజెక్ట్ ఏదో ఒకే చేశాడట అని బ్రహ్మానందంతో వెన్నెలకిషోర్ చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి రాజా గౌతమ్, వెన్నెలకిషోర్ తటాపటాయిస్తుండగా.. ఏంటి నీళ్లు నములుతున్నారని బ్రహ్మానందం అడగ్గా…సినిమాలో మంచి తాత క్యారెక్టర్ ఉందటా.. డైలాగ్స్ కూడా ఉన్నాయట… అని వెన్నెలకిషోర్ అనడం ఆసక్తిని పంచుతుంది. ఆ
క్యారెక్టర్‌ను బ్రహ్మానందం చేయడానికి ఒప్పించడానికి వెన్నెలకిషోర్, రాజా గౌతమ్ ఇద్దరు కలిసి ఆయన్ని తాతాగారు అని పిలవడం నవ్వులను పంచుతోంది. ఈ సినిమాకు టైటిల్ కూడా బ్రహ్మ…ఆనందం..అంటూ రాజా గౌతమ్ రివీల్ చేశాడు. 2024 డిసెంబర్ 6న బ్రహ్మ ఆనందం మూవీ రిలీజ్ కాబోతున్నట్లు ఈ వీడియోలో ప్రకటించారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో…
తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు పోస్టర్‌లో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో బ్రహ్మగా రాజా గౌతమ్, ఆనందంగా బ్రహ్మానందం కనిపించబోతున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రాహుల్ యాదవ్ నక్కా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.
పల్లకిలో పెళ్లికూతురు మూవీతో…
2004లో వచ్చిన పల్లకిలో పెళ్లికూతురు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజా గౌతమ్.ఆ తర్వాత వారెవా, బసంతి, మను సినిమాలు చేశాడు. దూత వెబ్‌సిరీస్‌లో ఓ కీలక పాత్రలో కనిపించాడు.
టాపిక్