మీకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి.. 

Best Web Hosting Provider In India 2024

నందిగామ మండ‌ల ప్ర‌చారంలో ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్ మోహ‌న్ రావు

ఎన్టీఆర్ జిల్లా:  మీ ఇంట్లో,  మీ గ్రామాలకు మంచి జరిగితేనే మ‌ళ్లీ జగనన్నను ముఖ్య‌మంత్రిగా ఆశీర్వ‌దించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నందిగామ ఎమ్మెల్యే మొండితోక జ‌గ‌న్ మోహ‌న్ కోరారు.  నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చి ప్రచారంలో మొండితోకపై పూల వర్షం కురిపించారు. మీ గ్రామాలకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి.. మా పాలనలో మార్పు కనపడితే మద్దతు ఇవ్వండి.. అంటూ డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  ప్రజలను ఓటు అభ్యర్థించారు . 

 మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రెండోసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నందిగామ  ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌ రావు అన్నారు. ల్యాండ్ యాక్ట్ విధానం ప్రజలకు మంచి జరుగుతుంది.. 94 దేశాలలో ఈ ల్యాండ్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. ప్రజల భూములకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు తెలిపారు.

Best Web Hosting Provider In India 2024