Jyothi Rai: గుప్పెడంత మనసు జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు వైరల్.. అలా చేస్తే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామంటూ..

Best Web Hosting Provider In India 2024

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ నటి జ్యోతి రాయ్. ఈ సీరియల్లో మేల్ లీడ్ రిషి పాత్రకు తల్లిగా జగతి అనే క్యారెక్టర్ లో జ్యోతి నటించింది. ఇప్పుడీ సీరియల్లో ఆమె పాత్రను చనిపోయినట్లుగా చూపించారు. ఇందులో ఎంతో పద్ధతిగా కనిపించే జ్యోతి.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది.

అయితే తాజాగా ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియోలు లీకయ్యాయని, వాటిని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామంటూ జ్యోతికి సంబంధించిన కొన్ని అశ్లీల ఫొటోలను కొందరు పోస్ట్ చేస్తున్నారు.

జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు

స్టార్ మా ఛానెల్లో వచ్చే గుప్పెడంత మనసు సీరియల్లో జగతి పాత్ర పోషించిన నటి జ్యోతి రాయ్. నిజానికి ఆమె వయసుకు మించిన పాత్ర అది. అయినా అందులో జీవించేసిన ఆమె.. బయట మాత్రం ఇన్‌స్టాగ్రామ్ లో తన హాట్ హాట్ ఫొటోలు, ఎదపై టాటూ వేయించుకుంటున్న వీడియోలు, రెండో పెళ్లి వార్తలతో సంచలనం రేపింది. ఇప్పుడు ఇదే జ్యోతి రాయ్ అశ్లీల వీడియోలు లీకయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి.

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియో లీక్ ల ఉదంతం మరచిపోక ముందే జ్యోతి రాయ్ వీడియోలంటూ సోషల్ మీడియా మార్మోగుతోంది. కర్ణాటకలోని హసన్ లోక్‌సభ స్థానం ఎంపీయే ఈ ప్రజ్వల్ రేవణ్ణ. ఈ మధ్యే ఆయనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఆ రాష్ట్రంలో రచ్చరచ్చ అవుతోంది. తాజాగా జ్యోతి రాయ్ వీడియోలూ లీకవడంతో అసలు ఏం జరుగుతోందంటూ సోషల్ మీడియోలో చర్చ మొదలైంది.

సోషల్ మీడియా ఎక్స్ లో EDIT_BY_ABHI అనే అకౌంట్ ఆమె ఫొటోను పోస్ట్ చేస్తూ తమ దగ్గర ఆ వీడియోలు ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు తమ యూట్యూబ్ ఛానెల్ కు 1000 మంది సబ్‌స్క్రైబర్లు కాగానే ఆ వీడియో అప్‌లోడ్ చేస్తామనీ చెప్పడం గమనార్హం. దీనికి జ్యోతి రాయ్ చీరలో అందంగా ముస్తాబై ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియో తమ దగ్గర ఉందని టీజ్ చేస్తూ అందులోని స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేయడం గమనార్హం.

వాట్సాప్ లోనూ ఈ ఫొటోలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎక్స్ అకౌంట్లో ఈ వార్తలు వైరల్ అవడంతో చాలా మంది యూజర్లు బెంగళూరు సిటీ పోలీసులకు ట్యాగ్ చేస్తూ దీనిని తీవ్రంగా పరిగణించాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకైతే పోలీసులు స్పందించలేదు. అయితే ఆమె తన భర్తతో కలిసి ఇంటిమేట్‌గా ఉన్న సమయంలో తీసిన ఫొటోలనే ఇలా లీక్ చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

టీవీ సెన్సేషన్ జ్యోతి రాయ్

కన్నడ నటి అయిన జ్యోతి రాయ్.. అక్కడి టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది. తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ఆమెకు చాలా పేరు తెచ్చి పెట్టింది. అయితే సీరియల్ నటిగా కంటే తన ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోల ద్వారానే జ్యోతి రాయ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ మధ్య ఆమె రెండో పెళ్లి వార్తలు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.

తెలుగు డైరెక్టర్ అయిన సుకుమార్ పూర్వజ్ తోనే ఆమె రిలేషన్షిప్ లో ఉంది. 20 ఏళ్ల వయసులోనే మొదటి పెళ్లి చేసుకున్న జ్యోతి.. తర్వాత విడాకులు తీసుకుంది. వీళ్లకు 11 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అయితే తాజాగా బయటపడిన ఈ అశ్లీల వీడియోలు, ఫొటోల లీక్ మాత్రం ఆమెనే కాదు మొత్తం సోషల్ మీడియానే షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ఫొటోలు, వీడియోల్లో ఉన్నది జ్యోతి రాయేనా కాదా అన్నది కూడా తేలాల్సి ఉంది. దీనిపై ఆమె నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024