AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Best Web Hosting Provider In India 2024

AP Medical Colleges: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యులర్‌ పోస్టుల్ని తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 31 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్‌ నిర్ణయించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో మెడికల్ పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. ఎండి, ఎంఎస్‌, డిఎన్‌బి, ఎండిఎస్‌ వంటి డిగ్రీలతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర‌థులు కనీసం ఏడాది పాటు సీనియర్ రెసిడెంట్‌గా విధులు నిర్వర్తించి ఉండాలి. ఎంపికైన వారికి యూజీసీ పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగిన వారై ఉండాలి.

వయో పరిమితి…

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు 42ఏళ్లకు మించకూడదు. ఈడబ్ల్యుఎస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 47ఏళ్ళ వరకు మినహాయింపు ఉంటుంది. దివ్యాంగులకు 52ఏళ్ళ వరకు అనుమతిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు స్థానిక అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగాల్లో పాథాలజీలో 3, ఫొరెన్సిక్ మెడిసిన్‌లో 2, కమ్యూనిటీ మెడిసిన్‌లో 2, జనరల్ మెడిసిన్‌లో 8, పీడియాట్రిక్స్‌లో 1, డివిఎల్‌ 1, సైక్రియాట్రీలో 1, జనరల్ సర్జరీలో 3, ఆర్థోపెడిక్స్‌లో 2, ఆప్తమాలజీలో 1, ఓబీజీలో 2, అనాస్తాలజీలో 1, Otorhinolaryngology 1,రేడియో డయగ్నోసిస్‌లో 3 పోస్టుల్ని భర్తీ చేస్తారు.

పూర్తి వివరాలు దిగువ లింకు ద్వారా లభిస్తాయి. https://dme.ap.nic.in/

సీనియర్ రెసిడెంట్‌ పోస్టులు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పలు పోస్టుల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 241 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఏపీలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో అనాటమీ విభాగంలో 25పోస్టులు, ఫిజియాలజీలో 15, బయో కెమిస్ట్రీలో 20, ఫార్మకాలజీలో 20, పాథాలజీలో 20, మైక్రో బయాలజీలో 20, ఫోరెన్సిక్ మెడిసిన్‌లో 15, కమ్యూనిటీ మెడిసిన్‌లో 20, జనరల్ మెడిసిన్‌లో 15, ఫీడియాట్రిక్స్‌లో 5, డివిఎల్‌లో 4, సైక్రియాట్రీలో 4, జనరల్ సర్జరీలో 15, ఆర్థోపెడిక్స్‌లో 3, ఆప్తమాలజీలో4, ఓబీజలో 8, అనస్తాలజీలో 9, రేడియో డయాగ్నసిస్‌లో 10, డెంటిస్ట్రీలో 2, Otorhinolaryngologyలో 4 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఈ పోస్టుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచడం, తగ్గిస్తారు.

సీనియర్ రెసిడెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు మెడికల్ ఇనిస్టిట్యూషన్స్‌ రెగ్యులేషన్స్ 2022 ప్రకారం అర్హత కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో మెడికల్ పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. ఎండి, ఎంఎస్‌, డిఎన్‌బి, ఎండిఎస్‌ వంటి డిగ్రీలతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి.

ఎంపికైన వారికి నెలకు రూ.70వేల రుపాయల వేతనం చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే వారు 44ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల్ని కేవలం ఏడాది పాటు మాత్రమే కొనసాగిస్తారు. ఎంపికైన వారు తప్పనిసరిగా ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర‌థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ మెడికల్ డిగ్రీతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్, గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు కలిగి ఉండాలి. దీంతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు ఏపీ స్థానికత కలిగిన వారై ఉండాలి. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మాత్రమే నాన్‌ లోకల్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. తెలంగాణలో 4వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన వారు జీవో నంబర్ 132,133 ప్రకారం 2016లో జారీ చేసిన స్థానికత ధృవీకరణ పత్రాలను రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌ నుంచి సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తుతో పాటు ఓసీ అభ్యర్థులు రూ.1000ఫీజు చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా మెరిట్ జాబితాను ఖరారు చేసిన తర్వాత అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలు దిగువ లింకు ద్వారా లభిస్తాయి. https://dme.ap.nic.in/

158మంది ట్యూటర్ల నియామకం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదోనీ, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరులో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్లుగా పని చేయాల్సి ఉంటుంది. ట్యూటర్ పోస్టులకు ఎంబిబిఎస్‌ డిగ్రీతో పాటు మెడికల్ కౌన్సిల్ గుర్తింపు కలిగి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం పొంది ఉండాలి. మొత్తం 158 పోస్టుల్ని భర్తీ చేస్తారు.

ఇతర కౌన్సిళ్లలో సభ్యత్వం పొందిన వారు, ట్యూటర్ పోస్టులకు ఎంపికైతే ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యత్వాన్ని పొందాల్సి ఉంుటంది. ఒక్కో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అనాటమీ విభాగంలో 5(మొత్తం 25) పోస్టులు, ఫిజియాలజీలో 3(మొత్తం 15), బయోకెమిస్ట్రీలో 4(20), ఫార్మకాలజీలో 4(20), పాథాలజీలో ఆదోనీ, పులివెందుల, పాడేరులో 5, మార్కాపురం, మదనపల్లెలో 4 పోస్టులు, మైక్రోబయాలజీలో 4(20), ఫోరెన్సిక్ మెడిసిన్‌లో 3(15), కమ్యూనిటీ మెడిసిన్‌ 4(20) పోస్టుల్ని నియమిస్తారు.

దరఖాస్తు చేయడానికి గడువుతో పాటు పూర్తి నోటిఫికేషన్ కోసం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు దిగువ లింకు ద్వారా లభిస్తాయి. https://dme.ap.nic.in/

IPL_Entry_Point

టాపిక్

Ap JobsAndhra Pradesh NewsAp Govt JobsTeluguTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024