Best Web Hosting Provider In India 2024
Current Bill : తెలంగాణలో గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత మూడు నెలలుగా ఈ పథకం అమలవుతోంది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ తో నిరుపేదల ఇళ్లలో వెలుగులు విలజిమ్ముతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జగిత్యాల జిల్లాలో ఓ ఇంటి యాజమానికి కరెంట్ బిల్లు చూస్తే షాక్ తగిలినంత పనయ్యింది. వినియోగించిన కరెంట్ 14 యూనిట్లే అయినా 60,701 రూపాయల కరెంట్ బిల్లు రావడంతో వినియోగదారుడు అడ్డగట్ట రాజేశం కంగారు పడ్డారు.
14 యూనిట్ల రూ.60 వేల బిల్లు
జగిత్యాల బైపాస్ రోడ్డులో ల్యాబ్ నిర్వహించే రాజేశం ఇంటికి మూడు మీటర్లు ఉన్నాయి. అన్నింటికి మినిమం బిల్లు వస్తుంది. రూ.200 నుంచి రూ.300 బిల్లు మాత్రమే వచ్చేది. ఏప్రిల్ 3 నుంచి మే 6 వతేదీ వరకు 33 రోజుల్లో 14 యూనిట్ల కరెంటు వినియోగించారు. అందుకు మినిమం బిల్లు రావాలి. లేదంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కావడంతో జీరో బిల్లు రావాలి. కానీ బిల్లు 59,881 రూపాయలు, ఏరియర్స్ 820 రూపాయలు మొత్తం 60701 రూపాయల బిల్లు వచ్చింది. బిల్లు చూసిన రాజేశం గుండె గుభేలుమంది. వెంటనే ట్రాన్స్ కో కార్యాలయానికి వెళ్లి ఏఈఈకి ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన ట్రాన్స్ కో అధికారులు
వేసవి ఎండలతో అంత కరెంట్ వినియోగించారేమో అందుకే అంత బిల్లు వచ్చి ఉంటుందని ట్రాన్స్ కో అధికారులు ముందుగా భావించారు. కానీ వినియోగించిన కరెంట్ కేవలం 14 యూనిట్లే కావడంతో రూ.60,701 బిల్లు రావడం ప్రశ్నార్థకంగా మారింది. మీటర్ లో లోపమా? లేక ఆ లైన్ లో ఎక్కడైనా లోపంతో లోడ్ ఈ మీటర్ పై చూపుతుందా అనే అంశంపై విచారణ చేపట్టారు. త్వరలోనే సమస్యను కనుక్కుని పరిష్కరిస్తొమని ట్రాన్స్ కో అధికారులు తెలిపారు.
ఏసీ విద్యుత్ బిల్లు తగ్గించుకోవడం ఎలా?
సమ్మర్ లో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ చాలా విద్యుత్తును తీసుకుంటుంది. కానీ మీరు ఏసీని తెలివిగా వాడితే ఈ ఖర్చును తగ్గించవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి. ఏసీని నడపడం వల్ల భారీ బిల్లు రాకపోవచ్చు. మీరు విద్యుత్ ఖర్చును సులభంగా ఎలా తగ్గించవచ్చో తెలుసుకోండి. AC గురించిన అవగాహన మునుపటి కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు చాలా మంది ఏసీలు కొంటున్నారు. ఆ డివైజ్ ఎన్ని నక్షత్రాలు అని చూస్తున్నారు. 5 స్టార్ ఏసీ అయితే కరెంటు బిల్లు తక్కువగా పెరుగుతుంది. 3 స్టార్ AC మీకు దాని కంటే చాలా ఎక్కువ బిల్లును ఇస్తుంది. ఈ విషయాన్ని ముందుగా అందరూ గుర్తుంచుకోవాలి. అయితే అనేక నియమాలు ఉన్నాయి. అవి తెలిస్తే కరెంటు బిల్లు తగ్గుతుంది. ఉదాహరణకు ఇన్వర్టర్ AC అయితే విద్యుత్ వినియోగాన్ని చాలా తగ్గించవచ్చు. అయితే ఇవన్నీ AC కొనడానికి ముందస్తు నిర్ణయం. కొన్న తర్వాత కరెంటు బిల్లు తక్కువగా ఉండడం ఎలా? ముందుగా గుర్తుంచుకోండి, ACని 27 డిగ్రీల కంటే కిందకు చేయెుద్దు. అప్పుడే కరెంటు బిల్లు తగ్గుతుంది.
చాలా ACలు టర్బో మోడ్‌ని కలిగి ఉంటాయి. ఆ మోడ్‌ను వీలైనంత తక్కువగా ఉపయోగించండి. అప్పుడు కరెంటు బిల్లు తక్కువ రావచ్చు. AC చల్లబరుస్తుంది, ఇది తేమను కూడా తగ్గిస్తుంది. ప్రతి ఏసీకి డ్రై మోడ్ ఉంటుంది. అవసరమైతే ఆ మోడ్‌లో కొనసాగించండి. ఎందుకంటే ఇది ఇంటిని పొడిగా చేస్తుంది. కంప్రెసర్ రన్ కానందున, విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. ACలో ఫ్యాన్ మోడ్ కూడా ఉంది. గుర్తుంచుకోండి, ఇది గాలి మాత్రమే. కానీ ఇల్లు చల్లగా ఉన్నప్పుడు, మీరు ఈ మోడ్‌లో కూడా ఏసీని నడపవచ్చు. ఇది విద్యుత్ ఖర్చును ఎనిమిదో వంతుకు తగ్గిస్తుంది. దాంతో కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గుతుంది. AC గైడ్‌బుక్‌ని కూడా జాగ్రత్తగా చదవాలి. విద్యుత్ బిల్లులను ఆదా చేసే విధానం కూడా కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. ఒక కంపెనీ AC ఒక మోడ్‌లో ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఏసీని నడుపుతున్నప్పుడు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి.
HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar
టాపిక్