Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

Best Web Hosting Provider In India 2024

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. నేటి అర్ధరాత్రి రావాల్సిన ఈ చిత్రం ఆలస్యంగా సాయంత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హారర్ కామెడీ సినిమాలో అంజలి ప్రధాన పాత్ర పోషించారు. 2014లో వచ్చిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్‍గా పదేళ్ల తర్వాత సీక్వెల్‍గా ఇప్పుడు ఈ చిత్రం అడుగుపెట్టింది. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి బజ్ ఉన్నా ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను దక్కించుకోలేదు. ఈ క్రమంలో నెల ముగియకముందే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఆలస్యంగా..

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని నేడు (మే 8) స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ఇటీవలే ప్రకటించింది. అయితే, సాధారణంగా సినిమాలు అర్ధరాత్రి నుంచే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వస్తాయి. కానీ.. నేడు మధ్యాహ్నమైన ఈ చిత్రం అందుబాటులోకి రాకపోవడంతో సందిగ్ధత ఏర్పడింది. అసలు నేడు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా స్ట్రీమింగ్ మొదలైంది.

“పార్ట్ 2 అంటే గట్టిగా పగబట్టి ఉండొచ్చు. మళ్లీ వచ్చిందంటా గీతాంజలి. చూడండి మరి” అంటూ ఆహా ఓటీటీ ట్వీట్ చేసింది. సాయంత్రం స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చాక అప్‍డేట్ ఇచ్చింది. ఈ చిత్రానికి పాపులారిటీ ఉండటంతో ఓటీటీలో మంచి పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది.

గీతాంజలి మళ్లీ వచ్చింది‘ సినిమాలో అంజలి టైటిల్ రోల్ చేశారు. శ్రీనివాసరెడ్డి, సత్య, సునీల్, రవి శంకర్, షకలక శంకర్, సత్యం రాజేశ్, అలీ కీరోల్స్‌లో నటించారు. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ మెప్పించినా.. కథలో కొత్తదనం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముందు నుంచి మిక్స్డ్ టాక్ రాకపోవటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రానికి భాను భోగవరపు, నందు కథ అందించగా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. స్క్రీన్‍ప్లేలోనూ కోన వెంకట్ భాగమయ్యారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

ఇటీవలే సిద్ధార్థ్ రాయ్

సిద్దార్థ్ రాయ్ సినిమా మే 3వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ బోల్డ్ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన దీపక్ సరోజ్ ఈ చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు. అతడి సరసన తన్వి నేగి హీరోయిన్‍గా నటించారు. ఫిబ్రవరి 23న సిద్ధార్థ్ రాయ్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రానికి వి.యశస్వి దర్శకత్వం వహించారు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ పతాకాలు నిర్మించిన సిద్ధార్థ్ రాయ్ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. ఈ మూవీని ఇప్పుడు ఆహా ఓటీటీలో చూసేయవచ్చు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024