“దేవుడు ఒక రాత రాస్తే
ఈ డాక్టరు ఆ రాతను మరోలా మార్చారు”
మచిలీపట్నం డాక్టర్ ప్రేమ్ హార్ట్ & సూపర్ స్పెషలిటీ హాస్పిటల్లో హృదయాన్ని కదిలించే ఒక సంఘటన చోటు చేసుకుంది.
హెల్త్ చెకప్ కి వచ్చి op లో కూర్చున్న పేషంట్ ఆకస్మాతుగా గుండె నొప్పితో కూర్చున్న సీట్ లోనే కుప్పకూలీపోతుంటే అది సీసీ కెమెరాలో గమనించిన డాక్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి పేషెంట్ ని ఎత్తుకుని ICU లోకి తీసుకుని వెళ్లి తక్షణమే CPR చెయ్యడం, కరెంట్ తెరపి ఇవ్వడం, angio చెయ్యడం ఇలా పేషెంట్ ని కాపాడుకోవడానికి అని విధాలా ప్రయత్నించి విజయం సాధించారు.
మూడు రోజులు పాటు observationలో ఉంచి మాములు మనిషిగా చేసి ఇంటికి పంపించారు.
కులం,మతం,డబ్బు, హోదా వీటి అన్నిటికన్నా మానవత్వం గొప్పది అని మరోసారి రుజువయింది