
YSRCP Nandigama :
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ :
ది.07-01-2023(శనివారం) ..
గడపగడపలో సంక్షేమం – అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ..
కంచికచర్ల పట్టణంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలోని 8 వ వార్డు పరిధిలో శనివారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు -లబ్ధిదారులకు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శమని, సచివాలయ- వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు పాలనను అత్యంత చేరువ చేసిన దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థలను వారి రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయని -ఇది మన రాష్ట్రానికే గర్వకారణం అన్నారు, సంక్షేమ పథకాలను రాజకీయాలకి అతీతంగా అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ వేమ సురేష్ బాబు, ఎంపీపీ మలక్ బషీర్, జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి రమేష్, వైస్ ఎంపీపీ బండి మల్లికార్జున రావు, నాయకులు కాలవ వాసుదేవరావు, ఈవో రవికుమార్, నంబూరు పెదబాబు, మాడుగుల శంకర్, నారిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ..