YSRCP Nandigama :
అమరావతి / తాడేపల్లి :
ది.07-01-2023(శనివారం) ..
శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని అభినందించిన ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ..
తాడేపల్లి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆయన కార్యాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు, ఇటీవల జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకంలో భాగంగా ఎస్.సి సెల్ విభాగానికి కన్వీనర్ గా తనను నియమించినందుకు ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ..
అనంతరం శ్రీ సజ్జల రామకృష్ణరెడ్డి గారు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ను అభినందించి, పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పనిచేయాలని – రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఎస్.సి సెల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాలని, ఎస్.సి సెల్ విభాగ జిల్లా కమిటీలు -నియోజకవర్గ కమిటీల ఏర్పాటును పర్యవేక్షించాలని సూచించారు ..