Ginger Garlic Paste: అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేయడం మంచి పద్ధతి కాదా? పోషకాలు తగ్గుతాయా?

Best Web Hosting Provider In India 2024

Ginger Garlic Paste: అల్లం, వెల్లుల్లి… రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రెండూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ క్రియ కూడా సవ్యంగా ఉంటుంది. సాంప్రదాయ వైద్యంలో వెల్లుల్లి అల్లాన్ని వాడుతూ ఉంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఏ కూరా వండరు. ముఖ్యంగా మాంసాహారాలకు ఎక్కువ రుచిని అందించేది అల్లం వెల్లుల్లి పేస్టు. అయితే ఈ రెండింటినీ కలిపి పేస్ట్ చేయడం వల్ల పోషకాలు తగ్గే అవకాశం ఉందని ఒక వాదన వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.

అల్లం

ఆరోగ్యానికి మేలు చేసే ఒక శక్తివంతమైన ఔషధ మూలిక అల్లం. దీనిలో జింజరాల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అల్లం తినడం వల్ల కండరాల నొప్పి తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పట్టడం, వికారం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బరువు తగ్గడానికి అల్లం సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే శక్తి అల్లానికి ఉంది.

వెల్లుల్లి

ఇక వెల్లుల్లి విషయానికి వస్తే ఇది కూడా ఆరోగ్యాన్ని ప్రోత్సహించే సమ్మేళనాలతో నిండి ఉంటుంది. దీనిలో క్రియాశీల సమ్మేళనం అల్లిసిన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. వెల్లుల్లి రోగనిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలో చేరే బ్యాక్టీరియా వైరస్ వంటి వాటితో పోరాడేందుకు సహాయపడుతుంది.

అల్లం వెల్లుల్లి పేస్టు మంచిదేనా?

ఎంతోమంది అల్లం, వెల్లుల్లి ఈ రెండింటినీ కలిపి పేస్ట్ గా చేసి వాడడం వల్ల వాటి ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయని భావిస్తున్నారు. నిజానికి అది కేవలం అపోహ మాత్రమే. అల్లం, వెల్లుల్లి కలపడం వల్ల వాటి ప్రభావాలు మరింతగా పెరుగుతాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అల్లం వెల్లుల్లి… రెండూ కలపడం వల్ల బలమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను చూపిస్తాయి. ఈ రెండు పదార్థాలు కలిసి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

వెల్లుల్లిలోని అల్లిసిన్, అల్లంలోని జింజరాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు విడుదలవుతాయి. ఇవి రెండూ కలిసి శరీరానికి రక్షణ వలయాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి అల్లం వెల్లుల్లి, ఈ రెండింటిని కలిపి వాడడం వల్ల ఆరోగ్యమే కానీ ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవు.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024