మరోసారి ఫ్యాన్ గాలిబలంగా వీస్తుంది

Best Web Hosting Provider In India 2024

మంత్రి రోజా

చిత్తూరు:  రాష్ట్రంలో మరోసారి ఫ్యాన్ గాలిబలంగా వీస్తుందని మంత్రి రోజా పేర్కొన్నారు.  నగరిలో మంత్రి రోజా ఓటు హాక్కు వినియోగించుకున్నారు. న‌గరి మున్సిపల్‌ పోలింగ్ బూత్‌లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ..పోలింగ్ బూత్‌ల్లో మ‌హిళ‌లు పోటెత్తార‌ని, జ‌గ‌నన్న సాయాన్ని మ‌ర‌చిపోకుండా ఓటు రూపంలో కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నార‌ని తెలిపారు. మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాబోతున్నార‌ని ఆమె విశ్వాసం వ్య‌క్తం చేశారు.


ఓటు వేసిన వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌ రెడ్డి
శ్రీకాకుళంలో కొనసాగుతున్న పోలింగ్‌..ఓటు వేసిన మంత్రి ధర్మన ప్రసాదరావు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి పలువురు నేతలు
సత్తెనపల్లిలో ఓటు వేసిన అంబటి రాంబాబు
గాజువాకలో ఓటు వేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. 
విజయనగరంలో ఓటు వేసిన మంత్రి బొత్స సత్యనారాయణ 
పిఠాపరంలో ఓటు హక్కు వినియోగించుకున్న  అభ్యర్థి వంగా గీత

అందరూ ఓటు వేయండి: షేక్‌ అసిఫ్‌

అంద‌రూ ఓటు వేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి షేక్ అసిఫ్ కోరారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ 199 బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ అసిఫ్. విజయవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్నాను. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. పోలింగ్ బూత్‌లో ఏర్పాట్లు అన్నీ బాగానే చేశారు. కానీ ఒక గంట సేపు ఈవీఎంలు పనిచేయడం ఆగిపోయాయి.  
అధికారులు వచ్చి సరి చేశారు మళ్లీ పోలింగ్ మొదలైంది. ఉదయం గంట లేటుగా మొదలు అయింది కాబట్టి సాయంత్రం గంట సేపు సమయం పెంచాలి అని కోరడం జరిగింది

Best Web Hosting Provider In India 2024