Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి
తాడేపల్లి: ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి కోరారు. రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డిజి ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజి ఆర్ పి ఠాగూర్ మరికొందరు పోలీస్ అధికారులు మంగళగిరి టిడిపి ఆఫీసు లో కూర్చుని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్ లు చేసి టిడిపికి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిరాశా నిస్పృహలతో తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల హింసకు, దౌర్జన్యాలకు దిగుతున్నారని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తెలియచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు, దౌర్జన్యాలకు తావులేకుండా ఓటర్ల ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్దితి ఉండాలని అభిప్రాయపడ్డారు. బాపట్లలో నందిగం సురేష్ ఎన్నికల ఏజంట్లు ప్రయాణిస్తున్న కారుపై టిడిపి కార్యకర్తలు దాడిచేశారని, కారును ధ్వంసం చేసి వారిని భయభ్రాంతులకు గురిచేశారని తెలియచేశారు.
రెండు సార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డిజి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారి ఏబి వెంకటేశ్వరరావు,రిటైర్డ్ డిజి ఆర్ పి ఠాగూర్ మరికొందరు రిటైర్డ్ పోలీసు అధికారులతో కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుని జిల్లాల్లోని పోలీసు అదికారులకు ఫోన్ లు చేసి రానుంది టిడిపి ప్రభుత్వం కాబట్టి టిడిపికి అనుకూలంగా వ్యవహరించాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.దీనిపై ఎన్నికల సంఘం తక్షణం విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓటు వేసే సందర్భంలో ఆయన భార్య కూడా పోలీంగ్ బూత్ లోకి రావడం నిబంధనలకు విరుధ్దం అని, అలా ఆమెను పోలింగ్ సిబ్బంది ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.