Best Web Hosting Provider In India 2024
Flashback OTT: సినిమాల కారణంగా కొన్నాళ్లుగా బుల్లితెరకు దూరంగా ఉంటోంది అనసూయ భరద్వాజ్. జబర్ధస్థ్‌తో పాటు పలు టీవీ షోస్‌కు గుడ్‌బై చెప్పిన అనసూయ టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలతో పాటు యాక్టింగ్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.
కోలీవుడ్ ఎంట్రీ…
కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని, తమిళ సినిమా చేయాలని అనసూయ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. తమిళంలో ఫ్లాష్‌బ్యాక్ పేరుతో అనసూయ ఓ మూవీ చేసింది. ప్రభుదేవా హీరోగా నటించిన ఈ సినిమాలో రెజీనా, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అనివార్య కారణాల వల్ల ఈ మూవీ థియేటర్లలో విడుదలకాలేదు.
డైరెక్ట్‌గా ఓటీటీలోకి…
తాజాగా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఫ్లాష్‌బ్యాక్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జీ5 ఓటీటీలో ఫ్లాష్‌బ్యాక్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
రొమాంటిక్ డ్రామా మూవీ…
రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు డాన్ సాండీ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ మూవీలో ప్రభుదేవా రచయిత పాత్రలో కనిపించబోతున్నాడు. ఆంగ్లో ఇండియన్ టీజర్‌గా రెజీనా కనిపించనున్నది. ఈ మూవీలో అనసూయ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని సమాచారం. థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారా ష్లాఫ్‌బ్యాక్ మూవీతో అనసూయ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుందని చెబుతోన్నారు. ఫ్లాష్‌బ్యాక్ సినిమాకు శామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
ఐదు సినిమాలు…
గత ఏడాది ఏకంగా తెలుగులో ఐదు సినిమాలు చేసింది అనసూయ. రంగమార్తండతో పాటు విమానం సినిమాల్లో పాజిటివ్ రోల్స్ చేసింది. పెదకాపు, మైఖేల్ సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌లో కనిపించింది.
ఈ ఏడాది తెలుగులో రజాకార్‌లో కనిపించింది. తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్రలో అనసూయ నటించింది.
పుష్ప 2తో బిజీ…
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప -2 షూటింగ్‌తో అనసూయ బిజీగా ఉంది. ఇందులో దాక్షాయణి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నది. పుష్పరాజ్‌పై రివేంజ్ తీర్చుకునే మహిళగా ఫస్ట్ పార్ట్‌కి మించి సీక్వెల్‌లో అనసూయ విలనిజం ఉంటుందని సమాచారం. పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
అలాగే అనసూయ లీడ్ రోల్‌లో నటించిన ఆరి మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకకు పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు.
సిరి హనుమంతు…
జబర్ధస్త్ షోకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు హోస్ట్‌గా వ్యవహరించింది అనసూయ. 2022లో ఈ షోకు గుడ్‌బై చెప్పింది. అనసూయ స్థానంలో ప్రస్తుతం జబర్ధస్త్ షోకు సిరి హనుమంతు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.