Best Web Hosting Provider In India 2024
13 May 2024 4:42 PM
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
తాడేపల్లి: మంచి నాయకుడ్ని ఎన్నుకునేలా పోలింగ్ జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో పోలింగ్ వన్ సైడ్ జరుగుతుందనే ఉదేశ్యం తో టిడిపి హింస కు పాల్పడుతోందన్నారు. సోమవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.
- టిడిపి కి ఓటమి భయం పట్టుకుంది.ఎలాగూ ఓడిపోతామని తెలిసిపోవడంతో కొత్త డ్రామాలకు తెరలేపారు
- మాచర్ల లో ఘర్షణలను ప్రేరేపించింది టిడిపి శ్రేణులే. పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు.
- కుప్పం, మాచర్ల, తాడిపత్రి లలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు
- వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేసి, దుర్మార్గంగా తిరిగి వారి పైనే ఫిర్యాదులు చేస్తున్నారు
- రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఠాగూర్, మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఐబీ వెంకటేశ్వరరావులకు టీడీపీ ఆఫీసులో ఏం పని?
- వారు జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేసి బెదిరించటం ఏంటి?.ఈ ఇద్దరి వ్యవహారశైలిపై ఈసీకి ఫిర్యాదు చేశాం
- ఉదయం పోలింగ్ కేంద్రాల్లో చాలా చోట్ల ఈ వి ఎం లు పని చేయలేదు.
- పని చేయని ఆ సమయాన్ని సాయంత్రం ఆరు తర్వాత పెంచాల్సిందిగా ఎన్నికల కమీషన్ ని కోరాం
- వృద్దులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారు. మంచి నాయకుడ్ని ఎన్నుకునేలా పోలింగ్ జరుగుతోంది