Best Web Hosting Provider In India 2024
ఎండ విపరీతంగా దంచికొడుతుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో భాగంగా చియా విత్తనాలు తినండి. ఇవి మీ మెుత్తం శ్రేయస్సుకు మంచిది. శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాల్లో చియా విత్తనాలు ఒకటి. ఈ గింజలను రోజూ తినాలి.
ఈ చియా గింజలను జ్యూస్‌లో లేదా త్రాగే నీటిలో వేస్తే మంచిది. చియా గింజలను రోజూ రసం లేదా నీటిలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చియా విత్తనాలలో పోషకాలు ఎంత ఉంటాయో చూద్దాం..
కేలరీలు: 138, ప్రోటీన్: 4.7 గ్రా, కొవ్వు: 8.7 గ్రా, పిండి పదార్థాలు: 11.9 గ్రా, ఫైబర్: 9.8 గ్రా, కాల్షియం: రోజుకు అవసరమైన కాల్షియంలో 14 శాతం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ B1, విటమిన్ B3.
బరువు తగ్గవచ్చు
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. చియా సీడ్స్ తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు బరువు అదుపులో ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఆకలి దప్పులు కూడా రావు. తద్వారా అతిగా తినడం అరికట్టవచ్చు. మీరు డైట్‌లో ఉన్నప్పుడు, మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి మీ మిల్క్‌షేక్‌లో దీన్ని జోడించవచ్చు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
చియా విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. దీనిని తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎముకల ఆరోగ్యానికి మేలు
ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని నీటిలో వేసి తీసుకోవడం మంచిది.
ఒక రోజులో ఎన్ని చియా విత్తనాలు తీసుకోవాలి?
మీరు ఒక రోజులో 2-3 స్పూన్ల చియా విత్తనాలను తీసుకోవచ్చు. చియా గింజలను రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ఎలాంటి సమస్యా ఉండదు. చియా విత్తనాలను నేరుగా కాకుండా రసంలో తీసుకోవడం మంచిది.
చియా విత్తనాల వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా?
దీన్ని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి పొట్ట, పేగు సమస్యలు వస్తాయి. చియా గింజలు మాత్రమే కాకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు ఇది ఒక సాధారణ సమస్య అని మీరు గమనించాలి.
చియా గింజలకు అలెర్జీ ఉండటం చాలా అరుదు.. అయినప్పటికీ, ఇది సాధ్యమే. మీరు ఇవి తింటే అలెర్జీ వస్తే అస్సలు తినకూడదు. ఈ గింజలను కొన్ని ఇతర ఆహార పదార్థాలతో కలపడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. నారింజ, ఆవాలు, మెంతులు, కొన్ని ఇతర వస్తువులతో తినవద్దు.
తక్కువ రక్తపోటు ఉన్నవారు దీనిని తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు మరింత తగ్గవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి.