Bollywood: వాటి గురించి సుశాంత్ సింగ్ చాలా బాధపడేవారు: మనోజ్ బాజ్‍పేయ్

Best Web Hosting Provider In India 2024

Manoj Bajpayee: బాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ మరణం తీవ్ర విషాదంలో నింపింది. 2020 జూన్‍లో ఆయన కన్నుమూశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించినా.. ఆ తర్వాత విచారణ కొనసాగుతూనే ఉంది. సుశాంత్‍కు న్యాయం చేయాలని అభిమానులు కూడా డిమాండ్లు చేస్తునే ఉన్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ ఓ విషయంలో బాగా ఇబ్బందిగా ఫీలయ్యే వాడని బాలీవుడ్ నటుడు మనోజ్ బాయ్‍పేయీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఊహాగానాలతో ఉన్న మీడియా ఆర్టికల్స్ గురించి ఆయన బాధపడే వారని చెప్పారు.

చాలా ఫీలయ్యేవాడు

సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ చాలా మంచి వ్యక్తి అని, నెగెటివ్ కథనాలు అతడిని బాగా ఎఫెక్ట్ చేశాయని మనోజ్ బాజ్‍పేయీ చెప్పారు. “బ్లైండ్ ఆర్టికల్స్ విషయంలో సుశాంత్ సింగ్ చాలా ఫీలయ్యే వాడు. సుశాంత్ సింగ్ చాలా మంచి మనిషి. మంచి వారినే ఇలాంటి విషయాలు ప్రభావితం చేస్తాయి. ఈ విషయంలో ఏం చేయాలని తాను తరచూ నన్ను అడిగేవాడు. అయితే తాను కూడా ఇలాంటివి చాలా ఎదుర్కొన్నానని, వాటిని పట్టించుకోవద్దని నేను చెప్పేవాడిని” అని సిద్ధార్థ్ కన్నన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్‍పేయ్ చెప్పారు.

సుశాంత్ సింగ్ చాలా తెలివైన వాడని, అలాగే సెన్సిటివ్ అని మనోజ్ బాజ్‍పేయీ వెల్లడించారు. కొన్ని విషయాలను తాను చాలా బలంగా ఎదుర్కొంటానని చెబుతుండే వాడినని, అయితే తాను అలా చేయలేనని సుశాంత్ అంటుండేవాడని గుర్తు చేసుకున్నారు. మొత్తంగా నెగెటివ్ బ్లైండ్ల్ ఆర్టికల్స్ సుశాంత్‍ను బాగా ఇబ్బంది పెట్టాయని మనోజ్ వెల్లడించారు.

సుశాంత్ సింగ్, మనోజ్ బాజ్‍పేయీ కలిసి సోచియాలా చిత్రంలో నటించారు. సుశాంత్ గురించి గతంలోనూ మనోజ్ కొన్ని సందర్భాల్లో చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మరోసారి ఆయన మాట్లాడారు.

బాలీవుడ్‍లో నెపోటిజం వల్ల సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ చాలా ఇబ్బందులు పడ్డారని ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. సుశాంత్ మరణంపై వేగంగా విచారణ జరిపి న్యాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా చాలాసార్లు డిమాండ్లు చేస్తూనే ఉన్నారు.

మనోజ్ లైనప్..

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మనోజ్ బాజ్‍పేయీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‍లతోనూ బిజీబిజీగా ఉంటున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన సైలెన్స్ 2 వెబ్ సిరీస్ ఇటీవలే జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రస్తుతం ‘భయ్యా జీ’ అనే మూవీ చేస్తున్నారు మనోజ్. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ మూవీలో మనోజ్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం మే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

అలాగే, ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్‍‍ కూడా ప్రస్తుతం చేస్తున్నారు మనోజ్. ఇటీవలే ఈ ఫేమస్ వెబ్ సిరీస్ మూడో సీజన్ షూటింగ్ మొదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రానుంది. ఈ ఏడాదిలోనే ఈ సీజన్ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ది ఫ్యాబీతో పాటు మరో మూవీ కూడా మనోజ్‍ బాయ్‍పేయీ లైనప్‍లో ప్రస్తుతం ఉన్నాయి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024