NNS May 14th Episode: అమర్‌పై వశీకరణ మందు.. భాగీపై అరుంధతికి అసూయ.. మనోహరికి చిక్కిన సరస్వతి మేడమ్​!

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 14th May Episode) అమర్​, పిల్లలు భోజనం చేస్తుంటే వడ్డిస్తుంది మిస్సమ్మ. మాయాదర్పణంలో తన పిల్లలు, భర్తని చూసిన అరుంధతి బాధపడుతూనే తన భర్త, పిల్లల్ని ప్రేమగా చూసేందుకు ఓ కుటుంబం దొరికినందుకు సంతోషపడుతుంది. మిస్సమ్మ కొసరికొసరి వడ్డిస్తుంటే చిరాకుపడతాడు అమర్​.

అటు ఇటుగా తిరగడం

అది చూసి అసూయ పడుతుంది అరుంధతి. వడ్డించింది చాలు వచ్చి కూర్చొని నువ్వు కూడా తినమ్మా.. అంటాడు రామ్మూర్తి. వద్దు నాన్నా.. అంటూనే అమర్​ పక్కన కూర్చుంటుంది భాగీ. పొరపాటున అమర్​ గ్లాసులో నీళ్లు తాగడంతో గుర్రున చూస్తాడు. అంతా చూసిన అరుంధతి భాగీని కోప్పడుతుంది. ఇంతలో మనోహరి అటు ఇటుగా తిరగడం చూసి దీనికేమైంది? అంటుంది.

ఆ బాలిక చాలా పాపములు చేసింది బాలికా.. అందుకే ఆమె చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది అంటాడు గుప్త. అప్పుడే కొందరు వచ్చి అటూ ఇటూ వెతకడం, వారిని చూసి మనోహరి దాక్కోవడం చూసి వాళ్లెవరు గుప్తగారు అని అడుగుతుంది అరుంధతి. ఆ బాలిక గతం.. ఇక చాలు ఈరోజుకి అని మాయాదర్పణం మూసేస్తాడు గుప్త. బీహారీల కంటపడకుండా తప్పించుకున్న మనోహరి ఎలాగైనా సరస్వతి మేడమ్​ని త్వరగా చంపేయాలి అనుకుంటుంది.

డ్రైవర్ బాబ్జితో

డ్రైవర్​కి ఫోన్​ చేసి ఏమైందని అడుగుతుంది. సరస్వతి మేడమ్​ని చంపకపోతే ఏమవుతుందో అతనికి వివరిస్తుంది. ఆమె ఫొటో పంపించమని అంటాడు డ్రైవర్​. అమర్​కి నిజం చెప్పేందుకు ప్రాణాలకు తెగించి ఊరు బయలుదేరుతుంది సరస్వతి. కొద్దిదూరం నడిచి ఎవరైనా వస్తే లిఫ్ట్​ అడుగుదామని ఆగుతుంది. అప్పుడే డ్రైవర్​ బాబ్జి వస్తున్న కారు కనపడటంతో ఆపమని అడుగుతుంది. తనని నర్సాపురంలో దింపమని అడుగుతుంది.

తాను కూడా ఆ ఊరికే వెళ్తున్నా రమ్మంటూ కారులో ఆమెని ఎక్కించుకుంటాడు బాబ్జి. సిగ్నల్​ లేకపోవడంతో మనోహరి పంపిన ఫొటో చూడలేకపోతాడు. సరస్వతి మేడమ్​ని కారులో ఎక్కించుకుని నర్సాపురం వెళ్తూ ఉంటాడు. రామ్మూర్తితో బయటకు వెళ్లిన పిల్లలు ఇంకా రావడంలేదని కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు అమర్​. వాకిట్లో కాళ్లు కాలిన పిల్లిలా తిరుగుతున్న అమర్​ని చూసి ఏమైందని అడుగుతుంది భాగీ.

అలా చెప్పే మోసం చేశారు

పిల్లలకోసం ఎదురుచూస్తున్నాని అనడంతో వాళ్లని బయటకు తీసుకెళ్లింది మా నాన్నే కదా. వాళ్లని సొంత మనవళ్లు, మనవరాళ్లలా చూసుకుంటారు అంటుంది. సొంత మనుషుల్లా అక్కర్లేదు.. అలా చెప్పే మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అంటాడు అమర్​. దాంతో కోపంగా ఇలా ఎలా ప్రతి విషయాన్ని పెళ్లితో ముడిపెట్టి మాట్లాడతారు అంటుంది భాగీ. అప్పుడే అక్కడకు వచ్చిన పిల్లలు ఊరంతా తిరిగామని, బాగుందని, ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉంటామంటారు పిల్లలు.

మీకు రేపు ఫుల్​ ఎంటర్​టైన్​మెంట్​ ఇస్తా పిల్లలు.. నాకు కథలు చెప్పడం వచ్చు.. నేను మీకు బాగా కథలు చెప్తా అంటుంది భాగీ. అవును.. నీకు కథలు చెప్పడం బాగా వచ్చని మాకు తెలుసు, అవి చెప్పే కదా మమ్మల్ని ఇన్నాళ్లు మోసం చేశావు అంటుంది అంజు. భాగీ బాధపడుతుంది. పిల్లలు, అమర్​ అక్కడనుంచి వెళ్లిపోతారు. రామ్మూర్తి, రాథోడ్​ బయట కూర్చుని మాట్లాడుతూ ఉంటారు.

అమర్‌పై వశీకరణం

మిస్సమ్మ మనసు అర్థం చేసుకునేలా మా సారుకు ఏదైనా మందు పెడితే బాగుంటుందేమో అని అంటాడు రాథోడ్​. కానీ, రామ్మూర్తి దానికి ఒప్పుకోడు. అదంతా కిటికీలోనుంచి విన్న మనోహరి వెంటనే మంగళని పిలిచి పసరు మందు తెప్పించమంటుంది.

ఆ వశీకరణ మందుతో అమర్​ తన మాట వినేలా చేసుకుని తెల్లారేసరికి అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోవాలి అనుకుంటుంది. అమర్​కి తాను పాలల్లో పసరు కలిపి ఇస్తే తన మాటే వింటాడని మురిసిపోతుంది.

పాలల్లో కలిపి

అనుకున్నట్లుగానే మంగళ పసరు మందు తెచ్చి పాలల్లో కలిపి మనోహరిని పిలవడానికి వెళ్తుంది. ఇంతలో రాథోడ్​ వచ్చి ఆ పాలను తీసుకెళ్లి భాగీకి ఇచ్చి అమర్​కి ఇవ్వమని చెప్తాడు.

భాగీ తెచ్చిన పాలను తాగుతాడు అమర్​. సరస్వతి మేడమ్​ బాబ్జీ దగ్గరనుంచి ఎలా తప్పించుకుంటుంది? పసరు మందు అమర్​పై ఎలా పని చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే మే 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024