AP Weather Updates: పగలు మండే ఎండలు, సాయంత్రానికి భారీ వర్షాలు, ఏపీకి ఐఎండి తీపి కబురు

Best Web Hosting Provider In India 2024

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదైనా సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది.

మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వివరించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి అల్లూరి జిల్లా పాడేరులో 57.5మిమీ, ప్రకాశం జిల్లా కనిగిరిలో 52.5మిమీ, శ్రీసత్యసాయి జిల్లా సోమండేపల్లిలో 46.5మిమీ, బాపట్ల జిల్లా అద్దంకిలో 38.5మిమీ, ప్రకాశం చంద్రశేఖరపురంలో 38మిమీ, అల్లూరి జిల్లా కొయ్యురులో 29.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. దాదాపు 27 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడినట్లు తెలిపారు.

సాధారణ ఉష్ణోగ్రతలు…

రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల క్రితం వరకు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 47డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో 41.2°C, తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో 41.1°C, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 40.8°C, నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 40.6°C, కృష్ణా జిల్లా కంకిపాడు,ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరులో 40.4°C, కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో 40.3°C, శ్రీకాకుళం జిల్లా సారవకోటలో 40.2°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ముందే రుతుపవనాల రాక…

ఈ ఏడాది మార్చి నెలలోనే వాతావరణం మారిపోయింది. మార్చి చివరి వారం ఏప్రిల్‌ నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత, వడగాలులతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు.

ఎండ వేడితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణశాఖ కూడా తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది కాస్త ముందే గానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 19నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.

ఏపీలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండ దని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగో దావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయల సీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ప్ర

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
 
IPL_Entry_Point
 

టాపిక్

 
WeatherImd AmaravatiSdmaAndhra Pradesh NewsCoastal Andhra Pradesh
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024