Brahmamudi May 14th Episode: బ్రహ్మముడి- రాజ్‌‌కు ముద్దు పెట్టిన కావ్య- పెద్దమ్మను నిలదీసిన కల్యాణ్- తెలిసిన మాయ అడ్రస్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కల్యాణ్‌తో ప్రేమగా, రొమాంటిక్‌గా ప్రవర్తిస్తుంది అనామిక. కానీ, కల్యాణ్ మాత్రం దూరం పెడతాడు. అరెస్ట్ చేయించడమే వచ్చు అనుకున్నా. ఇలా ముద్దులు పెట్టడం కూడా వచ్చని ఇప్పుడే తెలిసిందని కల్యాణ్ అంటాడు. జరిగిపోయిన దాని గురించి ఎందుకు. నీతో ప్రేమగా ఉండాలని ఉంది అని అనామిక అంటుంది.

అది ఫిక్స్ అయ్యాను

నీకు ఒక్కదానికే అనిపిస్తే సరిపోదు అని కల్యాణ్ అంటాడు. ఏ మూడ్ లేదా. సారీ కల్యాణ్ అని అనామిక చెబుతుంది. తర్వాత వెళ్లి అక్కడున్న ఫ్లవర్ వాజ్ తీసుకురమ్మంటాడు కల్యాణ్. దాంతో సరే అని తీసుకొస్తుంది అనామిక. ఫ్లవర్ వాజ్‌ను కిందపడేయమని అంటాడు కల్యాణ్. ముందు ఎందుకని అడిగినా.. తర్వాత నువ్ ఏం చెబితే అది చెద్దామని ఫిక్స్ అయ్యాయని అనామిక అంటుంది. ఫ్లవర్ వాజ్ కిందపడేస్తుంది. దాంతో అది ముక్కలు అవుతుంది.

ఇప్పుడు దానికి సారీ చెప్పమంటాడు కల్యాణ్. అనామిక సారీ చెబుతుంది. అతుక్కుందా. నా మనసు కూడా ఇలాగే ముక్కలు అయిందని కల్యాణ్ అంటాడు. అది వస్తువు. నువ్ ప్రాణం ఉన్న మనిషివి అని అనామిక అంటే.. ప్రాణం ఉంది కానీ, అందులో ప్రేమ లేదు. దాన్ని నువ్వే చంపేశావ్ అని కల్యాణ్ అంటాడు. ఒక్కసారి తప్పు జరిగితే జీవితాంతం దూరం పెడతావా. మనం భార్యాభర్తలం అని అనామిక అంటుంది.

ఇదిష్టం అని ఆలోచించలేదు

అది అనుకుంటే సరిపోదు. ఎప్పుడు నీకు నచ్చినట్లే ఉండాలని అనుకున్నావ్. ఇప్పుడు కూడా నువ్ నీకు నచ్చే వచ్చావ్. ఇదివరకు నేను కూడా నీ దగ్గరికి ఇలా ప్రేమగా వస్తే ఛీ కొట్టావ్. అప్పుడు కూడా నిన్ను అర్థం చేసుకున్నాను. కానీ, నువ్ మాత్రం నన్ను మెషిన్‌లానే చూశావ్. నీకు భర్త అంటే సంపాదించాలి, గొప్పగా బతకాలి. అంతే కానీ నాకు ఏదిష్టం అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మనం ఎప్పటికీ కలవం అని కల్యాణ్ చెప్పేసి వెళ్లిపోతాడు.

మరోవైపు రాజ్ తనకు ఫ్లవర్ బుకేపై మై డియర్ కళావతి అని రాసిన గ్రీటింగ్స్ చూసి మురిసిపోతుంది కావ్య. నా మీద ప్రేమ లేనప్పుడే మీపై ప్రేమ చూపించినదాన్ని. అలాంటిది మీకు ప్రేమ ఉందని తెలిసినప్పుడు ప్రేమ చూపించకుండా ఎలా ఉంటాను అని రాజ్‌ను చూస్తూ అనుకుంటుంది కావ్య. అనంతరం పడుకున్న రాజ్ దగ్గరికి ప్రేమగా, మెల్లిగా వెళ్తుంది. రాజ్‌కు ముద్దు పెడదామని దగ్గరికి వెళ్లి ఆగిపోతుంది.

రాజ్‌కు కావ్య ముద్దు

నాకేంటీ గుండె ఇంత వేగంగా కొట్టుకుంటుంది అని కావ్య అనుకుంటుంది. ఇంతలో కావ్య మనసాక్షి బయటకు వచ్చి నవ్వుతుంది. ఏంటీ ఎందుకు నవ్వుతున్నావ్ అని కావ్య అడుగుతుంది. పెళ్లై ఇన్నాళ్లైన శోభనం కాలేదు. నీపై ప్రేమ ఉందని తెలిసింది కదా. తను ఎలాగు బయటపడడు. నువ్వే ముందుకు వెళ్లాలి. లేకుంటే ఇంకో బిడ్డను తీసుకొస్తాడు. అప్పుడు వాళ్లకు పాలు పడుతూ కూర్చోవాలి. వెళ్లి పక్కన కూర్చుని ముద్దు పెట్టుకో అని ధైర్యం చెబుతుంది కావ్య మనసాక్షి.

దానికి భయంగా ఉందని కావ్య అంటే.. ఈ మగాళ్లను నమ్మకూడదే. లేకుంటే ఇంకో బాబును తీసుకొస్తాడు అని ధైర్యం చెప్పిన కావ్య వినదు. దాంతో సరే నేను పెట్టుకుంటాను. అది చూసి నువ్ పెట్టుకో అని కావ్య మనసాక్షి అంటుంది. నువ్ పెట్టుకుంటావా అని కావ్య ఆశ్చర్యంగా అడిగితే.. నువ్వు నేను ఒకటేనా. మన మొగుడేనే అని కావ్య మనసాక్షి వెళ్లి రాజ్‌కు ముద్దు పెడుతుంది. దాంతో కావ్య కళ్లు మూసుకుంటుంది. అది చూసిన కావ్య మనసాక్షి ఓసీ నీ సిగ్గు సింతకెళ్లే అని మాయమైపోతుంది.

ఫిటింగ్ పెట్టిన రుద్రాణి

నిద్ర లేచిన రాజ్ కావ్య కళ్లు మూసుకోవడం చూసి కంగారుపడతాడు. పిలిచి ఎందుకే కళ్లు మూసుకున్నావ్. బట్టలన్నీ బాగానే వేసుకున్నాను కదా అని అంటాడు. ఏం చెప్పకుండా కావ్య సిగ్గుతో వెళ్లిపోతుంది. అర్థం కాక రాజ్ చూస్తాడు. మరోవైపు కల్యాణ్ హాల్లో కవితలు రాసుకుంటూ ఉంటాడు. అది చూసిన రుద్రాణి.. ఈ సంగతి అనామికకు తెలిస్తే గొడవ చేస్తుంది అని వెతుకుతుంది. కాఫీ తాగుతున్న అనామికకు చేదు వార్త చూపిస్తానని కల్యాణ్‌ను చూపిస్తుంది రుద్రాణి.

కల్యాణ్‌ను చూసి షాక్ అవుతుంది అనామిక. ఏంటీ సైలెంట్‌గా ఉన్నావ్. నిలదీయకుండా అని రుద్రాణి అంటుంది. తనను చెంపపై కొట్టింది గుర్తు చేసుకుంటుంది అనామిక. రెండో చెంప వాయిస్తాడని భయపడుతున్నావా అని రుద్రాణి అడిగితే.. ఎవరితో అడగించాలో వారితోనే అడిగిస్తాను అని ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్తుంది అనామిక. ఆఫీస్‌కు.. రాజ్ వెళ్లక, కల్యాణ్ వెళ్లకుండా ఉండే నా కొడుకే వెళ్తాడని రుద్రాణి అనుకుంటుంది.

కుక్కలు మొరుగుతున్నాయనుకున్నా

ధాన్యలక్ష్మీని హాల్లోకి తీసుకొచ్చిన అనామిక కల్యాణ్ అని అరుస్తుంది. కానీ, కల్యాణ్ పలకడు. అనామిక అంతలా గొంతు చించుకుని అరుస్తుంటే పలకవేంటీ అని రుద్రాణి అడుగుతుంది. అవునా. నేను బయట కుక్కలు మొరుగుతున్నాయని అనుకున్నాను అత్త అని కల్యాణ్ అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. పిలవడం అంటే నీలా సుతిమెత్తంగా పిలవాలి. పక్కనే ఉన్నాగా అరవడం ఎందుకు అని కల్యాణ్ అంటాడు.

ఇక్కడే ఎందుకు ఉన్నావ్ అని ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. కొత్త ఆలోచన వచ్చింది. రాస్తున్నాను అని కల్యాణ్ అంటాడు. పాత పని మొదలెట్టావా. మరి ఆఫీస్‌కు వెళ్లవా అని ధాన్యలక్ష్మీ అడిగితే.. ఏ ఆఫీస్‌కు. నేనేందుకు వెళ్తాను. వెళ్తే అన్నయ్య వెళ్తాడు. లేకుంటే వదినా వెళ్తుంది. నేను వెళ్లను. ఈరోజు నుంచి నాకు నచ్చిన పని. వచ్చిన పని చేసుకుంటాను అని కల్యాణ్ అంటాడు. ఆఫీస్‌కు ఎందుకు వెళ్లవ్ అని అనామిక అడిగితే.. అది నువ్వెవరు అడగడానికి అని కల్యాణ్ అంటాడు.

నా భార్య ఎలా అవుతుంది

నేను నీ భార్యను. అడగాల్సిన హక్కు, చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందని అనామిక అంటుంది. హో అవునా.. నేను భర్తనా. సరే అందరినీ తన భర్తపై కేసు పెట్టారా అని అడుగుతాడు కల్యాణ్. లేదు అనామిక ఒక్కతే నీ మీద కేసు పెట్టింది అని ప్రకాశం అంటాడు. నా మీద కేసు పెట్టిన మనిషి నా భార్యా ఎలా అవుతుంది నాన్నా. భార్య కానీ మనిషికి నన్ను అడిగే హక్కు ఎలా ఉంటుంది. ఆవిడకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఎక్కడ ఉంటుంది అని కల్యాణ్ అంటాడు. ఇది పాయింటే అని ప్రకాశం అంటాడు.

ఎవరు చూసుకోకుంటే కంపెనీ ఏమైపోతుంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. కంపెనీ గురించి ఆలోచించేంతగా నువ్వెప్పుడు ఎదిగిపోయావ్ అని ప్రకాశం అంటే.. నేను కంపెనీ గురించి ఆలోచించే అంతా ఎదిగిపోలేదు. కానీ, నా భర్త ఆఫీస్‌కు వెళ్లాలని, గొప్పగా ఉండాలని అనుకోవడం తప్పా అని అనామిక అంటుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఏ తప్పు చేయనివాడు నా కొడుకు. వాడి మీద కంప్లైంట్ ఇవ్వడం నీ తప్పు అని ప్రకాశం అంటాడు.

జైళ్లో పెట్టించాలనుకున్నావ్

ఇప్పుడు పోలీస్ కేస్‌కు ఆఫీస్‌కు సంబంధం ఏంటీ అని అనామిక అంటే.. ఉందని గట్టిగా అరుస్తాడు కల్యాణ్. అందరూ షాకై చూస్తారు. నా కవిత్వాన్ని ఇష్టపడి ప్రేమించావనుకున్నాను. కానీ, నాకు ఎందులో ఆనందం దొరుకుతుందో నీకు అవసరం లేదు. నా బట్టలు, క్రెడిట్ కార్డ్స్, కారులో తిరగడం అనేది మాత్రమే నీకు ముఖ్యం. నేను నేనుగా నీకు నచ్చలేనప్పుడు. నన్ను నన్నుగా అర్థం చేసుకోలేనప్పుడు నువ్ నాకు భార్యగా ఎలా కనిపిస్తావ్ అని కల్యాణ్ అంటాడు.

నన్ను అప్పును అనుమానించి కేసు పెట్టి జైళ్లో పెట్టించాలనుకున్నావ్. అది నువ్ కోరుకుందే కదా. బొమ్మలా నడుచుకుంటే క్షమిస్తావ్. లేకుంటే జైళ్లో పెట్టిస్తావ్. ఇక నిన్ను భార్యగా ఎలా ఒప్పుకుంటాను. పక్కలో పామును పెట్టుకుని తిరుగుతున్నప్పుడు. నీ మాట నేనెందుకు వింటాను. ఇన్నాళ్లు నీకోసం నాకు నచ్చినివన్నీ చేశాను. ఇక నుంచి నీకు నచ్చేది ఏది చేయను. నాకు నచ్చినవే చేస్తాను. ఆఫీస్‌కు అస్సలు వెళ్లను అని కల్యాణ్ తెగేసి చెబుతాడు.

పెద్దమ్మను నిలదీసిన కల్యాణ్

తనకు నచ్చింది జరిగిందని రుద్రాణి సంబరపడుతుంది. ఇలా అందరూ ఆఫీస్‌కు వెళ్లకపోతే ఎలారా అని అపర్ణ అడుగుతుంది. అది నా సమస్య కాదు పెద్దమ్మా. నీ సమస్య. నువ్వే అన్నయ్యను తొలగించావ్. కంపెనీని నడిపించే సమర్థుడు అన్నయ్యే అని తెలిసి కూడా తప్పించావ్. కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు నువ్వే ఒకసారి ఆలోచిస్తే మంచిది అని కల్యాణ్ నిలదీస్తాడు. అంతా షాక్ అవుతారు. కల్యాణ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో బాబు విషయంలో ఎందుకు తన తల్లి దూరంగా ఉందని సుభాష్‌ను అడుగుతుంది కావ్య. డబ్బు కోసం. నెల నెల అకౌంట్‌కు డబ్బు పంపిస్తానని అని సుభాష్ చెబుతాడు. దాంతో ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకోవచ్చు కదా అని కావ్య అంటే.. అడ్రస్ పంపిస్తానని సుభాష్ చెబుతాడు. కట్ చేస్తే కావ్య కారులో మాయ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుంది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024