Guppedantha Manasu May 14th Episode: గుప్పెడంత మనసు- తన ఉచ్చులో తానే పడిన శైలేంద్ర- పిచ్చోడిన చేసిన మహేంద్ర, వసుధార

Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Serial Episode 1074: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో వసుధార క్యాబిన్‌లో సీక్రెట్ మైక్ పెట్టిస్తుంటాడు శైలేంద్ర. అయిపోయిందా. ఎంతసేపు. ఎవరైనా వస్తే ప్రాబ్లమ్ అవుతుందని కంగారుడుతుంటాడు శైలేంద్ర. ఏంటీ సార్. సరిగ్గా ఫిక్స్ చేయాలి కదా అని మైక్ పెట్టే అతను అంటాడు. తర్వాత మైక్ ఫిక్స్ అయిందని చెబుతాడు. సరిగ్గా పని చేస్తుందా అని పదే పదే అడుగుతాడు శైలేంద్ర. దానికి కావాలంటే చెక్ చేసుకోండి. నేను మాట్లాడతాను. అటు వెళ్లి వినండి అని అతను చెబుతాడు.

నేను ఎక్కడ చూడలేదు

మీ ఫోన్ ఇవ్వండి కనెక్ట్ చేస్తా అని అతను కనెక్ట్ చేసి ఇస్తాడు. శైలేంద్ర వెళ్లి బ్లూటూత్ పెట్టుకుని వింటాడు. ఇలాంటి వాడిని నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు వీడికి ఇస్తాను అని అతను చేసేదే ఎధవ పని. నన్నే అనుమానిస్తావురా. నేను ఈ పనిలో అవార్డ్ తీసుకునే స్థానంలో ఉన్నాను. అలాంటిది మైక్ పనిచేస్తుందా అని నన్నే అడుగుతావారా. తాటి చెట్టంత ఉంటే సరిపోదు. ఆవగింజంత జ్ఞానం ఉండాలి అని బూతులు తిడతాడు.

దాంతో షాక్ అయిన శైలేంద్ర కోపంతో వస్తాడు. ఏంట్రా ఇది అలా తిడుతున్నావ్ అని శైలేంద్ర అడిగితే.. ఇలాంటి మాటలు వినేందుకే కదా సార్ మైక్ ఇక్కడ పెట్టింది. అందుకే అలా మాట్లాడాను. ఇప్పుడు వినిపిస్తోంది కదా అని అతను అంటాడు. తర్వాత డబ్బు అడిగితే.. ఇప్పుడెళ్లు ఆన్‌లైన్‌లో పంపిస్తాను అని శైలేంద్ర అంటాడు. వద్దు సార్. ఏదైనా మిస్టేక్ జరిగితే నేను దొరికిపోతాను. క్యాష్ ఇవ్వండి అని మైక్ అతను అంటాడు.

వసుధారకు అనుమానం

దాంతో శైలేంద్ర అలాగే ఇస్తాడు. మైక్ అతను ఇక్కడ ఉంకూడదు అని వెళ్లిపోతాడు. ఇప్పుడు వాళ్ల మాటలు అన్ని వినొచ్చు. వాళ్ల రహస్యాలు తెలిసిపోతాయి. ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చు అని అని శైలేంద్ర అనుకుని వెళ్లిపోతాడు. తర్వాత క్యాబిన్‌కు వచ్చిన వసుధార ఫైల్స్ కదిలి ఉన్నాయని తెలిసి అనుమానపడుతుంది. ఎవరైనా వచ్చారా అని మహేంద్రను అడుగుతుంది వసుధార. ఆ మాటలు శైలేంద్ర వింటాడు. మామయ్య మొన్నం ప్రాజెక్ట్‌కు పాస్ వర్డ్ అనుకున్నాం కదా. ఓపెన్ కావట్లేదు. మీ దగ్గర ఉందా అని వసుధార అడుగుతుంది.

హా నోట్ చేసుకున్నాను అని మహేంద్ర స్లిప్ తీసి ఇస్తాడు. అందులో రిషి ఫొటో చూస్తూ ఏమైపోయావ్ నాన్నా. ఇంకెన్నాళ్లని మాకు దూరంగా ఉంటావ్. నీకోసం వెతికిన చోటు అంటూ లేదు. ఇంకా నా ఊపిరి నీకోసమే ఉంది. ఇంకెన్నాళ్లు నాన్న ఈ నిరీక్షణ అని అంటాడు మహేంద్ర. వస్తారు మావయ్య మీరు బాధపడకండి. రిషి సార్ విషయంలో బెంగపెట్టకోకుకండి. ఆయన వచ్చే సమయం దగ్గరపడింది అని వసుధార అంటుంది. ఆ నమ్మకంతోనే ఉన్నాను అని మహేంద్ర అంటాడు.

సీక్రెట్ మైక్ ఫొటో

పాస్ వర్డ్ స్లిప్‌ను వసుధార తిరిగి మహేంద్రకు ఇస్తుంది. దాన్ని పర్స్ లోపల పెట్టబోతుంటే పర్స్ కిందపడుతుంది. అప్పుడు కిందకు చూసిన మహేంద్ర సీక్రెట్ మైక్ చూసి షాక్ అవుతాడు. దాన్ని ఫొటో తీసి చూస్తాడు. ఏంటీ మావయ్య ఏమైందని అడుగుతుంది వసుధార. దాంతో సైలెంట్‌గా ఉండమని సైగ చేస్తాడు మహేంద్ర. ఫోన్‌లో టేబుల్ కింద ఉన్న సీక్రెట్ మైక్ ఫొటో చూపిస్తాడు. దాంతో ఇద్దరూ కావాలనే మాట్లాడుతారు.

మహేంద్ర దగ్గినట్లుగా చేస్తే ఎవరో తల్చుకుంటున్నారు అని వసుధార అంటుంది. ఇంకెవరు తలుచుకుంటారు. ఆ వెధవే అనుకుంటా. వాడే ఆ శైలేంద్ర. వాడికంటే ఎధవ ప్రపంచంలో ఇంకెవరు ఉన్నారు అని మహేంద్ర అంటే.. వసుధార సైలెంట్‌గా ఉంటుంది. ఏంటీ గ్యాప్ వచ్చింది. కొంపదీసి మైక్ చూసేశారా అని శైలేంద్ర అనుమానపడతాడు. కానీ, వాడు ఇప్పుడు మారినట్లు ఉన్నాడు. నోటీసు విషయంలో మనుతో ఫైట్ చేస్తున్నాడు కదా అని మహేంద్ర అంటాడు.

మైక్ చూడలేదు

ఏంటీ మావయ్య మారడం. కాలేజీ మనుగారికి వెళ్లిపోతే ఎండీ సీటు దక్కదు అని చేస్తున్నాడు అని వసు అంటుంది. నా ఉద్దేశం పసిగట్టేశావే వసుధార అని శైలేంద్ర అనుకుంటాడు. ఎండీ సీటు కోసం ఎన్ని తప్పు చేశాడు మావయ్య అని అన్నీ చెబుతుంది వసుధార. అంటే వాడు ఎధవ. నీచుడు, దుర్మార్గుడు అనే కదా అని మహేంద్ర అంటాడు. వీళ్లు ఇలా అంటున్నారంటే మైక్ చూడలేదు అని శైలేంద్ర అనుకుంటాడు. కానీ, కాలేజ్ కోసం ముందుకు వచ్చాడు చూడు అది కరెక్ట్ అనిపిస్తుంది అని మహేంద్ర అంటాడు.

అంటే మీరు శైలేంద్రను నమ్ముతున్నారా అని వసుధార అడిగితే.. నమ్ముతున్నాను అని మహేంద్ర అంటాడు. బాబాయ్ నన్ను నమ్ముతున్నావా. అది చాలు. నువ్ నన్ను తిట్టిన పర్లేదు అని శైలేంద్ర అంటాడు. వాడిని ఎన్ని తిట్టిన, ఏమన్నా మనతో వచ్చి మాట్లాడుతున్నాడు. మను లాంటి వాడికి శైలేంద్ర కరెక్ట్ అని మహేంద్ర అంటే.. అతను ఏం చేసిన ఎండీ సీటు కోసమే అని వసుధార అంటుంది. అయితే ఆ సీటు ఇచ్చేద్దామని మహేంద్ర అంటాడు.

నా వైపు తిప్పుకోవాలి

దాంతో శైలేంద్ర సంబరపడతాడు. మావయ్య తనకు పదవి ఇచ్చేందుకు నేను ఒప్పుకోను అని వసుధార అంటుంది. ముందు కాలేజీని విడిపించని తర్వాత మిగతాది చూసుకుందాం అని ఇద్దరూ కావాలనే శైలేంద్ర గురించి మాట్లాడుతూ పిచ్చోన్ని చేస్తారు. ఈ సీన్ ఎంత రసవత్తరంగా ఉంది. బాబాయ్ నన్ను నమ్ముతున్నాడు. ఇప్పుడే మనం ఎంట్రీ ఇచ్చి బాబాయ్‌ను నావైపుకు తిప్పుకోవాలి అని బయలుదేరుతాడు.

మరోవైపు టేబుల్‌పై గుద్దుతూ వాదించుకున్నట్లు నటిస్తారు వసుధార, మహేంద్ర. మావయ్య మీరు నమ్మేది విష సర్పాన్ని అని వసుధార అంటుంది. కానీ, వాడు ఇప్పుడు మారిపోయాడు. ఏదైనా వాడే చేస్తాడు అని మహేంద్ర అంటాడు. బాబాయ్ ఏదో మాట్లాడుకుంటున్నారు అని వచ్చి అడుగుతాడు శైలేంద్ర. మేము ఎప్పుడు ఏం చేస్తున్నామో తెలుసుకోవడమే కావాలా అని శైలేంద్రపై సీరియస్ అవుతాడు మహేంద్ర. ఇప్పటిదాకా అంతలా పొగిడావ్ కదా బాబాయ్ అని అనుకున్న శైలేంద్ర ఏదో టెన్షన్ పడుతున్నారు. ఏమైంది బాబాయ్ అని అడుగుతాడు.

నేను తీసుకువస్తాను

ఇప్పుడు కాలేజ్ కష్టాల్లో ఉంది. దాన్ని కాపాడగలవా అని అడుగుతాడు మహేంద్ర. కాపాడగలను అని శైలేంద్ర అంటాడు. ఎలా కాపాడగలవు. ఆ మనుగాడు బయటకు రావాలి కదా. దానికి రాజీవ్ గాడు బతికి ఉండాలి కదా అని మహేంద్ర అంటాడు. వాడు బతికి ఉన్నాడా చచ్చాడా అనేది మీకెందుకు బాబాయ్. ఆ మను గాడిని నేను తీసుకుని వస్తాను. కానీ నేను చెప్పింది మీరు చేయాలి అని శైలేంద్ర అంటాడు. చేయమని వసుధార అంటుంది.

బాబాయ్ నువ్వైనా ఒప్పించు అని శైలేంద్ర అంటే.. నువ్ చెబితే కదా ఒప్పించేది అని మహేంద్ర అంటాడు. అది ఇప్పుడే చెప్పలేను. మీరే అన్నారు కదా ఈ ఎధవ చేయలేడు అని శైలేంద్ర అంటాడు. ఇది నువ్వెప్పుడు విన్నావ్ అని వసుధార అంటుంది. నేను వినలేదు. బాబాయ్ అలాగే అంటాడు కదా. ఏం బాబాయ్. నువ్ అన్న ఈ ఎధవ తీసుకొస్తాడు అని శైలేంద్ర అంటాడు. నాకు నమ్మకం లేదని వసుధార అంటుంది.

నా ప్లాన్ ఫాలో అవ్వాలి

నీ నమ్మకాలతో పని లేదమ్మా. శైలేంద్ర తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను అని మహేంద్ర అంటాడు. బాబాయ్ నువ్ ఈ మాట మీదుండు. నీ నమ్మకాన్ని నిజం చేస్తాను అని శైలేంద్ర అంటాడు. నిజంగానే కాలేజీని కాపాడి తీసుకొస్తాను. చూడండి అని వెళ్లిపోతాడు శైలేంద్ర. మరోవైపు శైలేంద్ర భయ్యే ఏంటీ ఫోన్ చేయట్లేదని ఆలోచిస్తుంటాడు రాజీవ్. కాల్ చేస్తే మళ్లీ ఏదేదో వాగి ఇరిటేషన్ తెప్పిస్తాడు. సరే చూద్దాం. ఈలోపు భయ్య కాల్ చేస్తే సరి లేకుంటే నా ప్లాన్ ఫాలో అవ్వాలి మరి అని రాజీవ్ అనుకుంటాడు.

తర్వాత మైక్ డిస్ కనెక్ట్ చేస్తాడు శైలేంద్ర. చూశావా వాడి నక్క బుద్ధి అని మహేంద్ర అంటాడు. దుర్మార్గులు అంత ఈజీగా నమ్మరు అని వసుధార అంటుంది. వాడి మేలు కోసం చేసుకుంది మనకు మేలు జరిగింది. కానీ, వాడు మనును ఎలా తీసుకొస్తాడో చెప్పట్లేదు. మనల్నీ ఏదో చేయమంటున్నాడు. అది ఏమై ఉంటుంది అని మహేంద్ర అంటాడు. ఇంకెముందు ఆ ఎండీ సీటు తనకు ఇవ్వమని అంటాడని వసుధార అంటుంది.

అగ్రిమెంట్ పేపర్స్

కట్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో మనును కలుస్తారు మహేంద్ర, వసుధార, శైలేంద్ర. మనను కావాలనే తిడతాడు మహేంద్ర. నీచుడా, దుర్మార్గుడా, దత్తత తీసుకుందామనుకున్నానే. నువ్ మనిషివేనా. నీకన్న ఈ ఎధవ శైలేంద్ర బెటర్ కదా మహేంద్ర అంటాడు. బాబాయ్ అని శైలేంద్ర అంటే.. సారీ.. ఫ్లోలో అన్నాను అని మహేంద్ర అంటాడు. సరే అనుకుంటాడు శైలేంద్ర. సరే ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని మహేంద్ర అడుగుతాడు.

ఇదిగో బాబాయ్ అని అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తాడు. ఇప్పుడు వీటితోనే పని. నేను చెప్పింది మీకు షాకింగ్‌గా అనిపించొచ్చు. కానీ, ఆవేశపడకండి అని శైలేంద్ర అంటాడు. సరే ఏంటో చెప్పు అని మహేంద్ర అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024