Double iSmart Teaser Time: డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రిలీజ్‍కు టైమ్ ఖరారు

Best Web Hosting Provider In India 2024

Double iSmart Teaser Date, Time: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. 2019లో వచ్చి బాక్సాఫీస్‍ను షేక్ చేసిన మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‍గా నాలుగేళ్ల తర్వాత ఈ చిత్రం వస్తోంది. దీంతో ‘డబుల్ ఇస్మార్ట్’పై ఎక్స్‌పర్టేషన్స్ అదే రేంజ్‍లో ఉన్నాయి. ఈ మూవీ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు ఈ చిత్రం నుంచి టీజర్ వస్తోంది. టీజర్ రిలీజ్ టైమ్‍ను మూవీ టీమ్ వెల్లడించింది.

డబుల్ ఇస్మార్ట్ టీజర్ డేట్, టైమ్ ఇదే

డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ రేపు (మే 15) ఉదయం 10 గంటల 3 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ నేడు (మే 14) వెల్లడించారు. డేట్‍ను మూవీ టీమ్ ఇటీవలే ఖరారు చేయగా.. రిలీజ్ టైమ్‍ను మాత్రం నేడు ప్రకటించారు. ఈ టీజర్ 85 సెకన్ల రన్‍టైమ్‍తో ఉండనుంది. హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు ఈ టీజర్‌ను టీమ్ తీసుకొస్తోంది.

2019లో ఇస్మార్ట్ శంకర్‌లోని డైలాగ్‍లు.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో పూరి కనెక్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నేడు ఓ వీడియో పోస్ట్ చేసింది. “ఇంతకు ముందెప్పడూ లేని విధంగా ప్రతీ చోట మాస్ హిస్టరియాను ఈ పూరీ కనెక్ట్స్ సినిమా క్రియేట్ చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చే ముందు ఆ ఇస్మార్ట్ శంకర్ మాస్ జాతరను మరోసారి చూసేయండి. డబుల్ ఇస్మార్ట్ టీజర్ రేపు (మే 15) ఉదయం 10:03 గంటలకు రానుంది” అని పూరి కనెక్ట్స్ ట్వీట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

 

రిలీజ్ డేట్ ఉంటుందా?

డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ చేయాలని ముందుగా పూరి జగన్నాథ్ భావించారు. అయితే, కొన్ని కారణాల వల్ల షూటింగ్ కొన్ని రోజులు నిలిచిపోవటంతో ఆలస్యమైంది. ఇటీవలే చిత్రీకరణ మళ్లీ షురూ అయింది. అయితే, రేపు రానున్న టీజర్లో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‍ను లేకపోతే కనీసం నెలనైనా మూవీ టీమ్ వెల్లడిస్తుందేమో అనే ఆసక్తి ఉంది.

డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరితో పాటు చార్మీ కూడా ఈ చిత్రానికి ప్రొడ్యూజర్‌గా ఉన్నారు. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అప్పటి వరకు ఎక్కువగా క్లాస్ పాత్రలు చేసిన రామ్ పోతినేని.. ఇస్మార్ట్ శంకర్‌లో ఒక్కసారిగా ఊర మాస్ క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో రామ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. సుమారు రూ.20కోట్లతో రూపొందించిన ఈ మూవీ ఏకంగా దాదాపు రూ.80కోట్లు దక్కించుకొని బ్లాక్‍బస్టర్ అయింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందని రామ్ – పూరి భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులోనూ ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇద్దరికీ ఆ రేంజ్ హిట్ పడలేదు.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024