Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

Best Web Hosting Provider In India 2024

Satya OTT Release: తమిళ సినీ ఇండస్ట్రీలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా రంగోలి. దీన్ని తెలుగులో సత్య అనే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేసి విడుదల చేశారు. ఈ సినిమాలో హమరేష్, ప్రార్ధన హీరోహీరోయిన్స్‌గా జోడీ కట్టారు. ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సత్య మూవీ తెలుగులో మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మే 10న థియేటర్లలో

అయితే తమిళ, తెలుగు వెర్షన్స్‌తో క్లైమాక్స్ షూట్ చేసిన ఈ సినిమాను పూర్తి రీమేక్‌గా కాకుండా తమిళ డబ్బింగ్ చిత్రంగా తెలుగులోకి తీసుకొచ్చారు. రంగోలి చిత్రాన్ని శివం మీడియాపై శివమల్లాల నిర్మాతగా తెలుగులో తీసుకొచ్చారు. కాగా మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురించి పెద్దగా ఆడియెన్స్‌కు తెలియలేదు.

ఎక్కువ రీచ్ కాకపోవడంతో

ప్రమోషన్స్‌తో సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. కానీ, అనుకున్నంత స్థాయిలో ఎక్కువ మందికి రీచ్ కాలేదు. ప్రతినిధి 2, కృష్ణమ్మ సినిమాలు సైతం అదే రోజున విడుదల కావడంతో అందరి ఫోకస్ వాటిపైకి మళ్లింది. దాంతో సత్య అనే సినిమా ఒకటి వచ్చిందనే విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిరాలేదు.

అంచనాలు లేకుండా చూస్తే

సత్య సినిమాకు పెద్దగా టాక్ కూడా రాలేదు. సినిమాలో లవ్ స్టోరీతోపాటు తల్లిదండ్రుల ఎమోషన్ ఎక్కువగా చూపించారని రివ్యూలు వచ్చాయి. నిదానంగా సినిమా సాగిన ఎలాంటి అంచనాలు లేకుండా చూసినవాళ్లను మెప్పిస్తుందని టాక్ వచ్చింది. అయితే లవ్ స్టోరీని, సన్నివేశాలను ఇంకాస్తా కొత్తగా రాసుకుంటే బాగుండనే ఫీలింగ్ కలిగినట్లు ప్రముఖ విశ్లేషకులు విశ్లేషించి చెప్పారు.

20 రోజుల్లోనే స్ట్రీమింగ్

ఇదిలా ఉంటే ప్రస్తుతం సత్య మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. థియేటర్లలో ఎక్కువగా రీచ్ కానీ సినిమాలు వీలైనంత త్వరగా ఓటీటీలోకి వచ్చేస్తాయన్న విషయం తెలిసిందే. అలా సత్య సినిమా కూడా నెల కాకముందే లేదా 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సత్య సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మంచి ధరకు అడిగినట్లు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత శివ మల్లాల తెలిపారు. దాంతో అమెజాన్ ప్రైమ్‌కు సత్య ఓటీటీ రైట్స్ నిర్మాతలు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నెల కాకముందే అంటే ఇదే నెలలో లేదా జూన్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.

అధికారిక ప్రకటన

అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెండు మూడు రోజుల ముంది అఫీయల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. థియేటర్లలో ఆదరణ పొందని ఈ టీనేజ్ లవ్ స్టోరీ సత్య ఓటీటీలో చూసి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రంగోలి సినిమాకు తెలుగు వెర్షన్‌లో వచ్చిన సత్య ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ముందే షూట్ చేయడంతో

ఇదిలా ఉంటే, తమిళ్ వెర్షన్ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన మార్పుల గురించి నిర్మాత తెలిపారు. “అదృష్టం ఏంటంటే రెండు వర్షన్స్ కింద క్లైమాక్స్‌ని ముందే డైరెక్ట్ చేసి పెట్టుకున్నారు. తమిళ్ క్లైమాక్స్ అంత వర్కౌట్ అవదు తెలుగులో అని సతీష్ గారితో అన్నప్పుడు తెలుగులో క్లైమాక్స్ రీ షూట్ చేద్దాం అన్నా. అన్నిటికీ ఓకే అన్నారు. కానీ, ఆ 5 మినిట్స్ క్లైమాక్స్ వెర్షన్ ముందే షూట్ చేసి ఉండటం వల్ల దానికి ప్రాపర్ డబ్బింగ్ చెప్పించి తెలుగులో క్లైమాక్స్ మార్చి తీసుకొస్తున్నాం” అని నిర్మాత తెలిపారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024