Best Web Hosting Provider In India 2024
Double Ismart Teaser Released: డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్నమోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. 2019లో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెలిసిందే.
మరోసారి పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో సినిమా రావడంతో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ రివీల్ చేసినప్పటినుంచి ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఎక్స్‌ట్రార్డినరీ రోల్ ప్లే చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఇటీవల డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ను మే 15న అంటే ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో విడుదల చేస్తామని ప్రకటించారు. దానికి తగినట్లుగానే తాజాగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్‌గా ఉంది. మరోసారి పూరి, రామ్ పోతినేని కాంబో మ్యాజిక్ రిపీట్ కానుందని తెలుస్తోంది.