Best Web Hosting Provider In India 2024
Devara First Single: దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పాడు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ఫియర్ సాంగ్ అంటూ ఈ దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డేకు ఒక రోజు ముందే సాంగ్ రాబోతోంది.
దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్
దేవర మూవీ నుంచి కొన్ని నెలల కిందట గ్లింప్స్ రిలీజైంది. తర్వాత మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ గ్యాప్ లో సినిమా రిలీజ్ డేట్ ను ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10కి మార్చారు. మొత్తానికి ఇన్నాళ్లకు మేకర్స్ నుంచి కీలకమైన అప్డేట్ వచ్చింది. దేవర ఫస్ట్ సింగిల్ రానుంది. మే 19న ఫియర్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో రక్తంతో తడిచిన చేయి, గొడ్డలి మాత్రమే కనిపిస్తోంది. దానిపై ఫియర్ సాంగ్ మే 19 అని రాసి ఉంది. ఈ ఫస్ట్ సింగిల్ టైటిల్ నే ఫియర్ సాంగ్ అంటూ మేకర్స్ భయపెట్టేస్తున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కాగా.. ఒక రోజు ముందే ఈ సాంగ్ రూపంలో అతని అభిమానులకు పండగ రానుంది.
ఇక ఈ మధ్య కాలంలో తన మ్యూజిక్ తో తమిళ ఇండస్ట్రీని అదరగొట్టేస్తున్న అనిరుధ్ ఈ దేవరకు మ్యూజిక్ కంపోజ్ చేస్తుండటంతో ఫస్ట్ సింగిల్ పై అంచనాలు పెరిగిపోయాయి. గతేడాది రజనీకాంత్ జైలర్ మూవీలో హుకుమ్ సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగినట్లుగానే అనిరుధ్ ఈ ఫస్ట్ సింగిల్ కూడా కంపోజ్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దేవర వచ్చేది ఆ రోజే..
ఇక దేవర మూవీ రిలీజ్ మరోసారి వాయిదా పడనుందా అన్న పుకార్ల నేపథ్యంలో అక్టోబర్ 10నే రాబోతోందని మరోసారి మేకర్స్ స్పష్టం చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ లోనే మూవీ రిలీజ్ డేట్ చెప్పారు. అక్టోబర్ 10నే వస్తుందని ఈ పోస్టర్ తో తేలిపోయింది. దేవర మూవీలో తారక్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే మూవీలోని ముఖ్యపాత్రల ఫస్ట్ లుక్స్ తోపాటు ఎర్ర సముద్రం ఒడ్డున రక్తపుటేరులు పారిస్తూ గ్లింప్స్ కూడా వచ్చింది. ఇక ఫస్ట్ సింగిల్ తో దేవరపై ఉన్న అంచనాలు మరో రేంజ్ కు వెళ్తాయేమో చూడాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న మూవీ ఇదే. ఇక హృతిక్ రోషన్ తో వార్ 2 మూవీతో అతడు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టనున్నాడు.