Best Web Hosting Provider In India 2024
Mutton Bone Stuck : హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రి వైద్యులు 66 ఏళ్ల వ్యక్తి అన్నవాహికలో ఎముక ముక్క ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. నెల రోజులకు పైగా ఈ ఎముక అన్నవాహిక ఇరుక్కుని పుండ్లు ఏర్పడటంతో తీవ్రమైన సమస్యల మారిందని వైద్యులు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కకిరేని గ్రామానికి చెందిన శ్రీరాములు దంతాలు లేకపోవడంతో ఆహారం సరిగా నమలలేక ఈ పరిస్థితికి గురయ్యాడని హిందూ పత్రిక పేర్కొంది. ఓ వివాహ విందులో అనుకోకుండా 3.5 సెంటీమీటర్ల పొడవైన మటన్ బోన్ మింగేశాడు శ్రీరాములు. కొన్ని రోజుల తర్వాత శ్రీరాములుకు ఛాతినొప్పి రావడంతో తొలుత కడుపునొప్పి ఉందని భావించిన స్థానిక వైద్యుల వద్దకు వెళ్లాడు. అనంతరం కామినేని ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధికా నిట్టల వద్దకు పంపించారు.
విజయవంతంగా శస్త్ర చికిత్స
డాక్టర్ రాధికా నిట్టల హిందూ పత్రికతో మాట్లాడుతూ “మటన్ ఎముక ఎక్కువ కాలం అన్నవాహికలో ఉండటం వల్ల రోగి పరిస్థితి తీవ్రంగా ఉంది, ఇది గుండెకు చాలా దగ్గరగా ఉన్న అన్నవాహిక గోడను చీల్చి, అల్సర్లకు కారణమైంది. పెరికార్డియంకు ఎముక సమీపంలో ఉండి మరింత సమస్యలకు కారణమైంది. దీనిని నివారించడానికి ఎండోస్కోపిక్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా నిర్వహించడం అవసరం ” అన్నారు. శ్రీరాములుకు శస్త్రచికిత్స విజయవంతమైన తరువాత, అతను కోలుకునే ప్రక్రియకు సహాయపడటానికి కఠినమైన ఆహారాన్ని అనుసరించాలని వైద్యులు సూచించారు.
రూ.5 నాణెం మింగిన బాలుడు
అనుకోకుండా ఐదు రూపాయల నాణెం మింగేసిన బాలుడిని దిల్లీలోని మూల్ చంద్ ఆస్పత్రి వైద్యులు కాపాడారు. బాలుడికి ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికీ ఎక్స్ రే తీయగా అతని కడుపులో రూ.5 నాణెం కనిపించింది. ఆ తర్వాత బాలుడిని దిల్లీలోని మూల్ చంద్ ఆసుపత్రికి తీసుకురాగా, డాక్టర్ రిషి రామన్ ఆధ్వర్యంలో బృందం చిన్నారికి ఆపరేషన్ చేశారు. అనస్థీషియాలో ఉన్న బాలుడి శరీరం నుంచి నాణేన్ని బయటకు తీయడానికి వైద్యులు రోత్ నెట్ ఆపరేషన్ చేశారు. నాణెం ఉన్న ప్లేస్ లో సెర్పింగినస్ స్లగ్-కవర్డ్ అల్సర్ ను వైద్యులు గుర్తించారు. మూల్ చంద్ ఆసుపత్రి డాక్టర్ రిషి రామన్ ఒక బాలుడి కడుపులో ఉన్న నాణాన్ని విజయవంతంగా తొలగించారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్