10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

Best Web Hosting Provider In India 2024

10 Years Telangana: జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబం ధించి పెండింగ్ అంశాలన్నింపై తక్షణమే నివేదికలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిల విషయం ఇంకా తేలలేదు. వీటిపై పేచీలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాలపై ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలను తెలుసుకున్నారు. వీటిపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ జరిగిన వాటి వివరాలపై కూడా సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.

18న క్యాబినెట్ భేటీ….

మే 18వ తేదీన శనివారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఏపీతో కొలిక్కి రాని వివాదాలు, రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల సాగు ప్రణాళికపై చర్చించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ ఇక తెలంగాణదే…

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతోంది. 2014 జూన్‌2న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మనుగడలోకి వచ్చింది. మరోవైపు షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ వివాదాలపై ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

పదేళ్లు పూర్త కానుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. పదేళ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలనిఆదేశించారు.

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

 

 

 
 
IPL_Entry_Point
 

సంబంధిత కథనం

టాపిక్

 
Telangana NewsCm Revanth ReddyGovernment Of TelanganaHyderabadAndhra Pradesh News
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024