Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

Best Web Hosting Provider In India 2024

Brinjal in Pregnancy: స్త్రీ జీవితంలో గర్భం ధరించడం అనేది అత్యంత అందమైన దశ. ఈ సమయంలో మహిళల్లో వివిధ రకాల హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అందుకే పోషకాహారాన్ని తినమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకే వారు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తినమని చెబుతారు. అలాగే కొన్ని రకాల ఆహారాలను తినవద్దని కూడా చెబుతారు. ఆయుర్వేదంలో మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఏం తినాలో, ఏం తినకూడదు వివరంగా ఉంది. అలాంటి మార్గదర్శక సూచనలలో కీలకమైనది వంకాయలు గర్భిణీలు తినకూడదని.

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం గర్భం అనేది ఒక సున్నితమైన దశ. తల్లీ బిడ్డా ఆరోగ్యం చాలా సున్నితంగా మారిపోతుంది. ఆయుర్వేద సూత్రాల ప్రకారం గర్భధారణ సమయంలో దోషాలు త్వరగా వస్తాయి. వంకాయలు నైట్ షేడ్ అనే కుటుంబానికి చెందినవి. ఇవి ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైన లక్షణాలను కలిగి ఉండమని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు.

వంకాయల వల్ల ఈ దోషాలు

వంకాయలు తినడం వల్ల వాత, పిత్త దోషాలు తీవ్రంగా మారుతాయి అని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు. ఈ దోషాలు కలిగితే ఆయుర్వేదం ప్రకారం అనేక శారీరక విధులకు ఆటంకం కలుగుతుంది. శరీరంలో ఎన్నో అసమతుల్యతలు రావచ్చు. గర్భధారణ సమయంలో జీర్ణక్రియ, జీవక్రియ సరిగా లేకపోతే సమస్యలు ఎక్కువవుతాయి.

వంకాయల్లో సోలారిన్, నికోటిన్ వంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి తక్కువ పరిమాణంలోనే వంకాయల్లో ఉన్నప్పటికీ గర్భధారణ సమయంలో మాత్రం ఇవి హానికరమైనవి అని చెప్పాలి. వంకాయలు, టమోటాలు, బంగాళదుంపలు ఇవన్నీ కూడా నైట్ షెడ్ కూరగాయల జాబితాలోకి వస్తాయి. వీటిని పెద్ద మొత్తంలో తీసుకుంటే శరీరంలో విషపూరిత ప్రభావాలు కనిపించవచ్చు. అలాగే వంకాయలో ఉన్న నికోటిన్ స్వల్ప మొత్తంలో ఉన్నప్పటికీ పిండం అభివృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

వంకాయలు అధిక ఫైబర్ కంటెంట్ ను తీసుకుంటాయి కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని తినమని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో మాత్రం వంకాయలు తినవద్దని చెబుతున్నారు. వీటిల్లో అలెర్జీలు కలిగించే లక్షణాలు, టాక్సిన్లు అధికంగా ఉంటాయని వివరిస్తున్నారు.

గర్బిణులు ఆహారంలో భాగంగా సహజంగా పండిన పండ్లను, చిక్కుళ్ళు ,లీన్ ప్రోటీన్ ఉన్న ఆహారాలు, తృణధాన్యాలు, ఆకుపచ్చని కూరగాయలను అధికంగా తినడం తల్లికీ బిడ్డకూ మేలు జరుగుతుంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024