Best Web Hosting Provider In India 2024
NNS Serial May 16th Episode: పిల్లలను సమ్మర్ క్యాంప్‌కి తీసుకుని వెళ్లడానికి స్కూల్ ప్రిన్సిపాల్ అమర్ ఇంటికి వస్తుంది. మనోహరి పిల్లలను తొందరపెట్టి కిందికి తీసుకువస్తుంది. ఒక్కసారి అమ్మ ఫొటోకి దండం పెట్టుకుంటామని పిల్లలు అమర్ రూమ్‌కి వెళ్తారు. మిస్సమ్మ కూడా మేడమ్ ఫొటో చూద్దామని అమర్ రూమ్‌లోకి వెళ్లబోతుంది.
మిస్సమ్మ ప్లాన్…
మనోహరి మిస్సమ్మను నానామాటలు అని లోపలకి వెళ్లకుండా ఆపుతుంది. చేసేదేంలేక బాధపడుతూ కిందకి వస్తుంది మిస్సమ్మ. ప్రిన్సిపాల్ మీ కోసమే వెయిట్ చేస్తున్నారని పిల్లలని తొందర పెడుతుంది మనోహరి. పిల్లలు బాధపడుతూ బయలుదేరతారు.
వాళ్లని ఎలాగైనా ఆపాలని స్నాక్స్ మరిచిపోయారంటూ మిస్సమ్మ కిందపడి దెబ్బ తగిలించుకుంటుంది. మిస్సమ్మ కిందపడటంతో పిల్లలు, అమర్, అమర్ తల్లిదండ్రులు, రాథోడ్.. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని కంగారు పడతారు. కాలికి దెబ్బతగిలి రక్తం రావడం చూసి అమర్… మిస్సమ్మ కాలికి కట్టుకడతాడు.
మనోహరి ఫైర్…
పిల్లలు శుభమా.. అని క్యాంప్‌కి బయలుదేరుతుంటే తనకి ఇలా జరిగిందంటూ బాధపడుతుంది మిస్సమ్మ. తనవల్ల పిల్లలు క్యాంప్‌కి వెళ్లలేకపోతున్నారంటుంది. మిస్సమ్మ ప్లాన్‌ను మనోహరి కనిపెడుతుంది. నీకుదెబ్బతగిలితే పిల్లల క్యాంప్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అంటూ మిస్సమ్మపై మనోహరి ఫైర్ అవుతుంది.
తల్లిని తప్పుపట్టిన అమర్…
నువ్వేం ఇంట్లో మనిషివి కాదు అంటూ మిస్సమ్మను అవమానిస్తుంది మనోహరి. . దానికి అమర్ తల్లి మనోహరిని కోప్పడుతాడు. పిల్లలు బయలుదేరుతుంటే ఇలా జరగడమేంటని బాధపడుతుంది. కానీ మనోహరి కొడుకు మాటలు పట్టించుకోకుండా పిల్లలను బలవంతంగా తీసుకెళ్లి కార్లో కూర్చోబెడుతుంది.
నిజమైన అరుంధతి మాట…
పిల్లలు ఏడుస్తూ ఉంటే అరుంధతి కోపంతో.. దేవుడా.. నా పిల్లలు ఏం పాపం చేశారని ఈ శిక్ష, నువ్వు నిజంగా ఉంటే వాళ్లు ఆ గేట్ కూడా దాటొద్దు అంటుంది. పౌర్ణమి ఘడియలు ప్రారంభమవడంతో అరుంధతి మాట నిజమై కారు వెనక్కి వస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ప్రిన్సిపాల్ స్వయంగా పిల్లల్ని కిందకి దించి సమ్మర్ క్యాంప్ క్యాన్సిల్ అయ్యిందని చెబుతుంది. మనోహరి మాట్లాడుతున్నా వినకుండా ప్రిన్సిపాల్ వెళ్లిపోతుంది. పిల్లలు సంతోషంతో గంతులు వేస్తారు.
రామ్మూర్తి ఓదార్పు…
మిస్సమ్మ, రాథోడ్ రామ్మూర్తి దగ్గరకు వస్తారు. పిల్లలకోసం దెబ్బ తగిలించుకున్నావా మిస్సమ్మ అంటాడు రాథోడ్. ఆ ఇంటి కన్నీళ్లు తుడవడం కోసం నీ రక్తం చిందించావా అంటాడు రామ్మూర్తి. ఆ మనోహరిని ఆపడం కోసం ఏమైనా చేస్తాను అనుకున్నా గానీ, పిల్లల కోసం ఇలా చేస్తానని అనుకోలేదు నాన్న అంటుంది భాగమతి. మనోహరిని ఇంకొక్క రోజు ఆపితే చాలని ఓ ప్లాన్ చెబుతుంది. ఆ ప్లాన్‌ని అమలు చేయడానికి తండ్రిని ఉదయాన్నే అమర్ ఇంటికి రమ్మని చెప్పి వెళ్తుంది.
పౌర్ణమి శక్తులు…
పౌర్ణమి రోజు తనకు వచ్చే శక్తులు ఎలాంటివో తెలుసుకోవాలనుకుంటుంది అరుంధతి. చిత్రగుప్తుడిని ఎంత అడిగినా చెప్పకపోవడంతో ఆలోచిస్తూ కూర్చుంటుంది. అసలు పౌర్ణమి రోజు అరుంధతికి ఏ శక్తులు రానున్నాయి? మనోహరిని ఎదుర్కోడానికి మిస్సమ్మ వేసిన ప్లాన్ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే!