Raw Mango vs Ripe Mango: పచ్చి మామిడి vs పండిన మామిడి… ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

Best Web Hosting Provider In India 2024

Raw Mango vs Ripe Mango: ఇది మామిడి పండ్ల సీజన్. మామిడిలో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లు లేదా కాయలు తినడం వల్ల శక్తి స్థాయిలు పెరగడంతో పాటూ, రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కొంతమంది పండిన, జ్యూసీగా ఉన్నతీపి మామిడి పండ్లను ఇష్టపడతారు. మరికొందరు పుల్లగా ఉండే పచ్చి మామిడి పండ్ల రుచిని ఇష్టపడతారు. శరీరానికి ఎక్కువ పోషకాలు అందాలంటే పచ్చి మామిడి లేదా పండిన మామిడిలో వేటిని అధికంగా తినాలో తెలుసుకోండి. ప్రపంచవ్యాప్తంగా మామిడిపండుకు అభిమానులకు ఎక్కువ. దీని ప్రత్యేకమైన రుచి, వాసన, పోషకాలు ఈ పండుకు అభిమానులను తెచ్చిపెట్టాయి.

మామిడి ప్రయోజనాలు

మామిడిలో బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చి మామిడి, మామిడి పండు… రెండింటినీ తినవచ్చు. ఈ రెండింటిలో ఏది తినడం వల్ల ఎక్కువ ఆరోగ్యకరమో తెలుసుకోండి.

పచ్చి మామిడి కాయ తింటే…

పండిన మామిడి పండ్లతో పోలిస్తే పచ్చి మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది తినే వారి జీర్ణశక్తిని పెంచుతుంది. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణ ఆరోగ్యానికి కీలకమైనది. ఆరోగ్యకరమైన పొట్ట బ్యాక్టిరియాకు ఇది సహకరిస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఎక్కువ. పచ్చి మామిడి పండ్లు పచ్చిగా ఉండడం వల్ల వీటిలో విటమిన్ సి నిండుగా ఉంటుంది. ఇది జీర్ణ ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. పచ్చి మామిడిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో సమృద్ధిగా ఉంటుంది.

పండిన మామిడి పండ్ల ప్రయోజనాలు

పండిన మామిడి పండ్లలో బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆక్సీకరణ నష్టం జరగకుండా సహాయపడతాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీటా కెరోటిన్‌తో సహా కెరోటినాయిడ్లు ఉంటాయి. ఈ కెరోటినాయిడ్లు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి వయస్సు-సంబంధిత మాక్యులర్ క్షీణత, కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పండిన మామిడి పండ్లలో అధిక విటమిన్ ఎ కంటెంట్ కలిగి ఉంటాయి. పండిన మామిడి పండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉన్నాయని గమనించడం ముఖ్యం. ఇది వాటిని తియ్యగా, మరింత రుచికరంగా చేస్తుంది.

పచ్చి మామిడి కాయ VS పండిన మామిడి

రోగనిరోధక మద్దతు కోసం: పచ్చి మామిడి పండ్లలో అధిక విటమిన్ సి కంటెంట్ కారణంగా తినవచ్చు.

యాంటీఆక్సిడెంట్ తీసుకోవడం కోసం: పండిన మామిడి పండ్లు, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్ల స్థాయిలను పెంచడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.

జీర్ణ ఆరోగ్యానికి: పచ్చి మామిడి కాయ, పండిన మామిడి కాయ… ఈ రెండింటిలో ఫైబర్‌ను అందిస్తాయి. కానీ పచ్చి మామిడిలో ఎక్కువ ఫైబర్ అధికంగా ఉంటుంది.

రుచి కోసం: పండిన మామిడి పండ్లు చాలా తీపిగా ఉంటాయి. వీటిని చాలా ఇష్టంగా తినే వారి సంఖ్య ఎక్కువ.

పచ్చి మామిడి కాయ లేదా పండిన మామిడి కాయ… ఈ రెండూ ఎన్నో పోషక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రెండింటినీ తినడం ముఖ్యమే. కాబట్టి రెండింటిలో ఏది తినాలో ఆలోచించకండి… రెండింటీని తినడం ముఖ్యం.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024