Best Web Hosting Provider In India 2024
Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ హంగులతో ప్రేక్షకులను అలరించాయి. మ్యాడ్‌మాక్స్ సిరీస్ సినిమాలకు కొనసాగింపుగా తాజాగా ప్రీక్వెల్ వస్తోంది. ఫ్యూరియోసా ఏ మ్యాడ్‌మాక్స్ సాగా పేరుతో తెరకెక్కుతోన్న విజువల్ వండర్ మూవీ మే 23న థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
14 వందల కోట్ల బడ్జెట్…
దాదాపు 1400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఫ్యూరియోసా ఏ మ్యాడ్‌మాక్స్ సాగా మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించాడు. ఈ మ్యాడ్‌మ్యాక్స్ ప్రీక్వెల్‌లో క్రిస్ హెమ్స్‌వర్త్, అన్న టేలర్ జాయ్ హీరోహీరోయిన్లుగా కనిపించబోతున్నారు. మ్యాడ్‌మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీకి 15 నుంచి ఇరవై ఏళ్లుగా ముందుగా ఫ్యూరియోసా కథ సాగుతుందని మేకర్స్ అనౌన్స్‌చేశారు. ఇమ్మోర్టన్ జాయ్‌ను ఎదురించింది ఫ్యూరియోసా, డిమెంటస్ అనే ఇద్దరు బైకర్లు సాగించిన పోరాటం నేపథ్యంలో యాక్షన్ అంశాలతో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో…
ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాను స్క్రీనింగ్ చేశారు. ఈ స్క్రీనింగ్‌కు ఏడు నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ లభించింది. ప్రీక్వెల్ అద్భుతమంటూ క్రిటిక్స్‌తో పాటు హాలీవుడ్ వర్గాలు ప్రశంసలు కురిపిస్తోన్నాయి.
మూడు రోజుల్లో యాభై మిలియన్లు…
ఇప్పటికే నార్త్ అమెరికాలో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్‌లోనే యాభై మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇండియాలోనూ ఫ్యూరియోసా ఏ మ్యాడ్‌మ్యాక్స్ సాగా వంద కోట్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ హాలీవుడ్ మూవీకి పెద్ద సినిమాలేవి పోటీ లేకపోవడం కలిసివచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
నాలుగు వచ్చాయి…ఇది ఐదోది…
మ్యాడ్‌మ్యాక్స్ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఫ్యూరియోసా ఐదో మూవీ. మ్యాడ్ మాక్స్ ది వెస్ట్‌లాండ్ పేరుతో ఆరో పార్ట్ కూడా రాబోతోంది. 2015లో రిలీజైన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ మూవీ కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో ఆరు ఆస్కార్ అవార్డులను అందుకున్నది. బెస్ట్ పిక్చర్, డైరెక్టర్‌తో పాటు మొత్తం పది విభాగాల్లోనామినేషన్‌ను దక్కించుకున్న ప్రొడక్షన్ డిజైన్, మేకప్, ఎడిటింగ్‌తో పాటు మరికొన్ని విభాగాల్లో అవార్డులను అందుకున్నది.
ఛోటా భీమ్ మూవీ
కాగా మ్యాడ్‌మ్యాక్స్ ప్రీక్వెల్‌తో ఇండియన్ భాక్సాఫీస్ వద్ద ఛోటాభీమ్ ది కర్స్ ఆఫ్ డమయాన్ మూవీ పోటీపడుతోంది. ఈ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ మూవీలో అనుపమ్ ఖేర్, నవనీత్ కౌర్, మకరంద్ దేశ్‌పాండేతో పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తోన్నాడు.
ఛోటా భీమ్ పాత్రకు ఇండియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఛోటా భీమ్ కథతో ఇప్పటివరకు ఎక్కువగా యానిమేటెడ్ మూవీస్ వచ్చాయి. వాటికి భిన్నంగా లైవ్ యాక్షన్ టెక్నాలజీతో ఈ మూవీని తెరకెక్కించారు. రాజీవ్ చిలక ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మే 24న ఛోటాభీమ్ ది కర్స్ ఆఫ్ డమయాన్ మూవీ రిలీజ్ కాబోతోంది.