Best Web Hosting Provider In India 2024
Telangana Court Jobs 2024 : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(Telangana Judicial Services) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లా జడ్జీల (ఎంట్రీ లెవెల్) పోస్టులను భర్తీ చేయనుంది. మే14వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జూన్ 13వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి ఎల్ఎల్ బీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. అర్హులైన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://tshc.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన – తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైకోర్టు.
- ఉద్యోగాలు – జిల్లా జడ్జీలు (ఎంట్రీ లెవల్)
- మొత్తం ఖాళీలు – 09 పోస్టులు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారానే భర్తీ చేయనున్నారు.
- అర్హతలు – గుర్తింపు పొందిన వర్శిటీ నుంచి లా డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఈ వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
- దరఖాస్తు విధానం – ఆఫ్ లైన్
- దరఖాస్తు ఫారమ్ ను హైకోర్టు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభం – మే 14, 2024.
- దరఖాస్తులకు చివరి తేదీ – జూన్ 13, 2024.
- స్క్రీనింగ్ టెస్ట్(కంప్యూటర్ ఆధారిత పరీక్ష) – ఆగస్టు 24, 25 2024.
- 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- స్క్రీనింగ్ టెస్టులో అర్హత సాధిస్తే… మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. 1.10గా ఎంపిక ఉంటుంది.
- మెయిన్స్ పరీక్షల్లో మూడు పేపర్లు ఉంటాయి. సివిల్ లా, క్రిమినల్ లాతో పాటు ఇంగ్లీష్ విభాగం నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- ఇంగ్లీష్ పేపర్ అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
- ప్రతి పేపర్ కు 100 మార్కులు కేటాయిస్తారు.
- ఇంగ్లీష్ లోనే పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.
- చివరగా వైవా కూడా ఉంటుంది. ఇందుకు 1.3గా ఎంపిక ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెల జీతం రూ. 144840 నుంచి 1,94660 వరకు ఇస్తారు.
- ఆఫ్లైన్ దరఖాస్తులను చీఫ్ సెక్రటరీ ఆఫీస్, తెలంగాణ, సెక్రెటేరియట్, హైదరాబాద్ 500022 అడ్రస్ కు పంపాలి.
- అధికారిక వెబ్ సైట్ – https://tshc.gov.in/getRecruitDetails
- అప్లికేషన్ ఫారమ్ కోసం లింక్ – https://tshc.gov.in/documents/reccell_14_2024_05_14_13_11_56.pdf
150 సివిల్ జడ్జి ఉద్యోగాలు…..
Telangana High Court Recruitment 2024 : మరోవైపు సివిల్ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కొద్దిరోజుల కిందటే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 17వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://tshc.gov.in/getRecruitDetails వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.
టాపిక్