పల్నాడు: వైయస్ జగన్ లాంటి ఏనుగు వెళ్తుంటే పవన్ లాంటి కుక్కలు మొరుగుతుంటాయి అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమేనని మంత్రి విమర్శించారు. తెలుగు రాజకీయాల్లో ఆయన ఓ కామెడీ పీస్ అని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడని అంటాడు, మంత్రులను దూషిస్తాడు. పవన్‌ది అసలు నోరేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు.
‘సింగిల్‌గా వెళితే వీరమరణం అని నీకు అర్థమైంది. పిరికి సన్నాసుల్లారా మీకు దమ్ము, ధైర్యం లేదు. మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే. మీకు ఆరాటం తప్ప పోరాటమే లేదు. పవన్ దృష్టిలో గౌరవం అంటే ప్యాకేజీయే. తగిన ప్యాకేజీ అందితే పొత్తుకు సిద్ధమని పవన్ మరోసారి చెప్పాడు. చంద్రబాబు కోసం పెట్టిందే జనసేన పార్టీ. పవన్‌లాంటి చీడ పురుగులకు ప్రజలు ఓట్లు వేయరు. చంద్రబాబుతో పవన్ ఏం మాట్లాడాడో మాకు తెలుసు. పవన్ వెళ్తున్న మార్గం మంచిది కాదని యువత గుర్తించాలి’ అని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎన్నికల్లో గెలవనేలేదని, జనసేన ఎంత మందితో కలిసి వచ్చినా.. మీకు రాజకీయ మరణమే అన్నారు. పవన్ చేసే కామెడీ చూడటానికే…జనం సభలకు వెళ్తున్నారు. పవన్ పిరికి సన్నాసిలా మాట్లాడుతున్నాడు.
పోరాడే దమ్ము, ధైర్యం పవన్ కల్యాణ్‌కు లేవన్నారు. పవన్ కల్యాణ్ ఓ పిరికి పంద, పిరికివాడే పదేపదే ధైర్యవంతుడనని అంటుంటాడని ఎద్దేవా చేశారు. పవన్ లాంటి పిరికివాడిని రాజకీయాల్లో ఇంత వరకు చూడలేదన్నారు. ఆయన ఇంత వరకు ఏ పోరాటం చేశాడో చెప్పాలని డిమాండు చేశారు. పవన్‌కు ఆరాటం తప్ప.. పోరాటం లేదని, ఆయన మాటలకు అర్థాలే వేరన్నారు.
ధైర్యవంతుడనని అంటాడు… సింగిల్‌గా వెళ్లలేనని అంటాడు. పవన్‌కు గ్యారంటీ ఇస్తే సింగిల్‌గా పోటీ చేస్తాడట..!!. ప్రజల విశ్వాసం పొందితేనే రాజకీయాల్లో నిలబడగలుగుతారని చెప్పారు. చెప్పులు తీసి కొడతామనడం రాజకీయమా..? అని నిలదీశారు. పవన్ కల్యాణ్‌కు కనీస ఇంగిత జ్ఞానం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టాదని, ఇలాంటి చీడ పురుగులను ప్రజలు ఎప్పుడూ ఆమోదించరన్నారు. పవన్ నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబుతో పవన్ ఏం మాట్లాడాడో మాకు తెలుసు..అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. అమ్ముడుపోయేందుకే పవన్ కల్యాణ్ తాపత్రయ పడుతున్నారని, పవన్ నైజాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గమనించాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.