Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Best Web Hosting Provider In India 2024

Blink OTT Streaming: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సై-ఫి థ్రిల్లర్ బ్లింక్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. మంగళవారం (మే 13) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా చూసిన వాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీకెండ్ కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఇదీ ఒకటని, ఇదొక అద్భతమని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుండటం విశేషం.

ప్రైమ్ వీడియోలోకి బ్లింక్ మూవీ

తెలుగులో వచ్చిన దసరా మూవీలో నానితో కలిసి నటించిన దీక్షిత్ శెట్టి హీరో చేసిన మూవీ బ్లింక్ (Blink). ఈ సినిమా కర్ణాటకలో మార్చి 8న రిలీజైంది. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత రెండు నెలలకు ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో కేవలం కన్నడ ప్రేక్షకులే ఆదరించిన ఈ బ్లింక్ మూవీని ఇప్పుడు భాషలకు అతీతంగా అభిమానులు చూస్తున్నారు.

50 రోజులకుపైగా థియేటర్లలో విజయవంతంగా నడించిన బ్లింక్ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అలాగే దూసుకెళ్తోంది. ప్రైమ్ వీడియోలో తొలి రోజే ఈ సినిమా చూసిన వాళ్లు మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్న శ్రీనిధి బెంగళూరు ఈ మూవీని డైరెక్ట్ చేసింది. విజ్రధీర్ జైన్, గోపాలకృష్ణ దేశ్‌పాండే, చైత్ర లాంటి వాళ్లు కూడా ఇందులో నటించారు.

బ్లింక్ ఓ అద్భుతం

ఇక బ్లింక్ మూవీని ప్రైమ్ వీడియోలో చూసిన కొందరు ప్రేక్షకులు ఎక్స్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. “కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సై-ఫి థ్రిల్లర్ మూవీ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. బ్లింక్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. అందమైన స్టోరీ టెల్లింగ్ తోపాటు క్లైమ్యాక్స్ మైండ్ బ్లోయింగా ఉంది” అని నటరాజ్ అనే ఓ యూజర్ రాసుకొచ్చాడు.

ఇదొక ఇంటెలిజెంట్ మూవీ.. ఏదో సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైన్మెంట్ మాస్ మూవీ కాదు. కొన్ని సినిమాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.. ఇదీ అలాంటిదే అని నవీన్ అనే మరో యూజర్ అన్నారు. మన ఊహ, సైన్స్ హద్దులను చెరిపేసిన మూవీ ఇది అంటూ మరొకరు అనడం గమనార్హం. బ్లింక్ ఓ ట్రైమ్ ట్రావెల్ స్టోరీ. ఈ సినిమా క్లైమ్యాక్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

అసలేంటి బ్లింక్ మూవీ?

అపూర్వ (దీక్షిత్ శెట్టి) అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథే ఈ బ్లింక్ మూవీ. బెంగళూరులో ఏవో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ గడిపే అతడికి అరివు (సురేష్ అనగల్లి) అనే వ్యక్తి తన గతాన్ని గుర్తు చేస్తాడు. అతని తండ్రి ఎలా కుటుంబాన్ని వదిలేశాడో వెళ్లాడో చెబుతాడు. అపూర్వ గతం మొత్తం చెబుతాడు. అయితే ఆ తర్వాత ఆ గతంలో ఏం జరిగిందో తెలుసుకున్న అపూర్వకు ఊహించని షాక్ తగులుతుంది.

కంటిరెప్ప‌ల‌ను మూయ‌కుండా నియ‌త్రించే శ‌క్తి అపూర్వ‌కు ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అదే అత‌డి లైఫ్‌ను ఎలా క‌ష్టాల్లోకి నెట్టింది? కంటి రెప్ప‌ల‌ను మూసిన మ‌రుక్ష‌ణం టైమ్ ట్రావెల్‌లో అత‌డు ముందుకు…వెన‌క్కి ఎలా వెళ్లాడు అన్న‌దే బ్లింక్ మూవీ క‌థ‌. 1996, 2001, 2021, 2035 కాలాన్ని చూపిస్తూ మొత్తం నాలుగు టైమ్ పీరియ‌డ్స్ నాన్ లీనియ‌ర్ స్క్రీన్‌ప్లేతో ఈ మూవీ సాగుతుంది. అదేంటన్నదే మూవీలో అసలు సస్పెన్స్. ఈ టైమ్ ట్రావెల్ మూవీని వీలుంటే ఈ వీకెండ్ లో కచ్చితంగా చూసేయండి.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024