Best Web Hosting Provider In India 2024
TS LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. లాసెట్ కు భారీగా దరఖాస్తులు రావటంతో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 3వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు.
కేవలం రెండు సెషన్లలో కాకుండా 3 సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అప్లికేషన్లు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఆలస్య రుసుంతో లాసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలోతెలిపారు. మే 20 నుంచి 25 తేదీల మధ్య కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుందని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి వెల్లడించారు.
మూడు సెషన్లలో పరీక్షలు
- జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలు జరుగుతాయి.
- ఉదయం 9 నుంచి 10.30 వరకు మొదటి సెషన్ ఉంటుంది.
- మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.
- సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు మూడో సెషన్ జరుగుతుంది.
- తొలి రెండు సెషన్లలో మూడేండ్ల లా కోర్సు ప్రవేశాలకు పరీక్షను నిర్వహిస్తారు.
- చివరి సెషన్‌లో ఐదేళ్ల లా కోర్సు, పీజీఎల్‌సెట్ పరీక్షలు ఉంటాయి.
How to apply For TS LAWCET 2024: ఇలా దరఖాస్తు చేసుకోండి….
- అర్హత గల అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- TS LAWCET & TS PGLCET 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- తొలుత పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- STEP 2:Fill Application Form అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై నొక్కి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- సబ్మిట్ బటన్ నొక్కటంతో మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- Download Application Form అనే ఆప్షన్ పై నొక్కి మీ దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ అప్లికేషన్ ఫారమ్ లో ఉండే రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ నెంబర్ అవసరపడుతుంది.
2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి.
5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు… జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు. తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.
టాపిక్