
తాడేపల్లి: సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ.. అని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
సంక్రాంతి పల్లెల పండుగ.. రైతుల పండుగ.. మన అక్కచెల్లెమ్మల పండుగ.. మొత్తంగా మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ.. అని జగన్ మోహన్ రెడ్డిగారు అన్నారు.
భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని– భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని, పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్ళలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.