Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో అప్పుకు కావ్య లైవ్ లొకేషన్ పెట్టడంతో మంగమ్మ, రౌడీలు కంగారుపడిపోతారు. ఇంక ఎంత దూరం అని కావ్య అడిగితే మంగమ్మ దగ్గరే అని చెబుతుంది. రౌడీలు మరొకరికి స్టార్ట్ అయిపో అని చెబుతాడు. తర్వాత కావ్యకు అడ్డంగా వ్యాన్ తీసుకొస్తారు రౌడీలు. రేయ్ ఏంట్రా ఇలా రోడ్డుపై ఆపారు కావ్య అరుస్తుంటే వ్యాన్ లోపలికి లాగుతారు రౌడీలు.

ఫాలో అయిన అప్పు

ఏం లేదమ్మా జస్ట్ కిడ్నాప్ చేస్తున్నాం అంతే. ఏంటీ లైవ్ లొకేషన్ పెట్టావా. ఇలాంటి ఆటలు ఎన్నో చూశాం అని మంగమ్మ అంటుంది. కావ్యను వ్యాన్‌లో తీసుకెళ్తారు. అది అప్పు చూస్తుంది. వ్యాన్ వెంట పరుగుపెడుతుంది. కాసేపటికి ఆయాసంతో అప్పు ఆగిపోతుంది. తర్వాత వ్యాన్ ఫొటో తీస్తుంది అప్పు. అక్క ఫోన్ స్విచ్ఛాఫ్ పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి. బావ బావకు ఫోన్ చేస్తా అని కాల్ చేస్తుంది అప్పు. కేర్ టేకర్ చెప్పిన మాటలను తలుచుకుంటాడు రాజ్.

రాజ్‌కు కాల్ వస్తుంది. కానీ, అప్పుది కాదు. వాచ్ మెన్‌ది. కావ్య మేడమ్ గారు ఆఫీస్‌కు వచ్చి ఫిబ్రవరి 19న ఎవరో గెస్ట్ వచ్చారా అని అడిగారు. ఎంత చెప్పిన వినకుండా సీసీ కెమెరా చూశారు. హార్డ్ డిస్క్ తీసుకెళ్లిపోయారు. రిట్రైవ్ చేస్తానని తీసుకెళ్లారు. ఇక్కడ బ్యాకప్ చేయడానికి హార్డ్ డిస్క్ లేదు. అందుకే కాల్ చేశాను అని వాచ్‌మెన్ అంటాడు. ఇంతలో సిగ్నల్ ప్రాబ్లమ్ ద్వారా ఫోన్ కట్ అవుతుంది. మరోవైపు అప్పు కాల్ చేసిన రాజ్ లిఫ్ట్ చేయడు. తనకు బిజీ వస్తుంది.

నేను పడిన బాధ చెప్పిందా

కళావతికి అంత నిజం తెలిసే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉందా అని రాజ్ అనుకుంటాడు. రాజ్‌తో పాటు తన ఫ్రెండ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికెళ్లి చెబుతానని వెళ్తుంది అప్పు. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయితీ జరుగుతుంటుంది. నా వల్ల మీ అమ్మాయి పడిన బాధనే చెబుతుంది. మరి తన వల్ల నేను పడిన బాధ చెప్పిందా అని కల్యాణ్ అడుగుతాడు. ఇప్పుడు కరెక్ట్ రూట్‌లో పంచాయితీ వచ్చింది. చెప్పండి అడుగుతున్నాడు కదా అని స్వప్న అంటుంది.

నా వల్ల నువ్వేం బాధపడ్డావ్ కల్యాణ్ అని అనామిక అడుగుతుంది. నీతో పెళ్లి అయినప్పటి నుంచి నేను బాధ పడుతున్నాను. కానీ, నీలా అరవలేదు. ఇలా నలుగురి ముందు నిలబెడుతున్నావ్. అందరిముందు నన్ను దోషిలా నిలబెట్టాలని చూస్తున్నావ్. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నావ్. ఏ తప్పు చేయని నాపై పోలీస్ కేసు పెట్టావ్. ఇప్పుడు ఇలా పంచాయితీ పెట్టించావ్. ఇన్ని చేస్తూ మళ్లీ నేను ఏం బాధపడుతున్నాను అని కొత్తగా అడుగుతున్నావ్. నువ్ ఇంట్లో అడుగుపెట్టినప్పటినుంచి నేను ప్రశాంతంగా నిద్ర పోయిందే లేదు అని ఎమోషనల్‌గా చెబుతాడు కల్యాణ్.

అనామికకు విడాకులు

సరే ఇద్దరివైపు తప్పులు ఉన్నాయి. ఇద్దరూ సర్దుకుపోయి సంసారం సాగిస్తేనే కదా అని ఇందిరాదేవి అంటుంది. లేదు నానమ్మ. సంస్కారం తెలియని అమ్మాయితో సంసారం సజావుగా సాగదు అని కల్యాణ్ అంటాడు. అంటే ఏమంటావ్ ఇప్పుడు అని అనామిక అంటుంది. నేను నీకు విడాకులు ఇద్దామనుకుంటున్నాను అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అంతా లేచి నిల్చుంటారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్. ఏదో చిన్నపిల్ల. ఒక్కగానొక్క పిల్ల కాబట్టి గారాబంగా పెరిగింది. దానికే విడాకులు ఏంటీ అని సీతారామయ్య అంటాడు.

రేయ్ ఏ ఇద్దరు ఒకలా ఆలోచించరు. నిదానంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి గానీ, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని సుభాష్ అంటాడు. నువ్ కూడా ఇలా అంటావేంటీ కల్యాణ్. చదువు, సంస్కారం ఉన్న నువ్ అనాల్సిన మాట కాదు అని స్వప్న అంటుంది. అనామికకు మూర్ఖత్వం ఉందనేది నిజమే. కానీ, అర్థం చేసుకునేదాకా నిదానంగా ఉండాలి కానీ, ఇలా పెళ్లి నాలుగు నెలలు కాకుండానే విడాకులు అనడం కరెక్ట్ కాదు అని అపర్ణ అంటుంది.

అప్పు ఎంట్రీతో షాక్

మా నాన్న మాట మా అమ్మ ఎప్పుడా దాటలేదు. వినింది కాబట్టే వాళ్లకు ఇన్నాళ్లు అయిన గొడవ రాలేదు అని సుభాష్ అంటాడు. నాకు తెగేదాకా లాగాలని లేదు. మా ఇద్దరి మధ్య కేవలం ఆ అప్పు వల్లే గొడవలు అవుతున్నాయి. దాన్ని దూరం చేస్తే చాలు అని అనామిక అంటుంది. ఇంతలో అప్పు పరుగెత్తుకుంటూ వస్తుంది. అంతా షాక్ అవుతారు. అంతా విసుక్కుంటారు. చూశారా కల్యాణ్ ఎందుకు విడాకులు ఇస్తానో ఇప్పుడు అర్థమైందా. ఇద్దరు మాట్లాడుకునే ఇలా చేస్తున్నారు అని అనామిక అంటుంది.

మళ్లీ అప్పు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని కల్యాణ్ అంటాడు. అనామిక అన్నదాంట్లో తప్పేముందు. మీరిద్దరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని రుద్రాణి అంటుంది. ఇక్కడ ఏం బాగోతం జరుగుతుంది అని అప్పు అంటుంది. పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లొచ్చిన నీకు బుద్ధి రాలేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏందమ్మా మీ బాధ. వాళ్లిద్దరు గొడవ పడితే నా మీద పడతారేంటీ. వాడేమైనా జగదేకవీరుడా. నీ కోడలు ఏమైనా అతిలోక సుందరా అని అప్పు అంటుంది.

మట్టి కొట్టుకుపోతారు

ఎప్పుడు నా కోడలు అనే సోది తప్పితే ఇంకోటి ఉండదా. రేయ్.. రారా భయ్ మనం లేచిపోదాం అని అప్పు అంటుంది. దాంతో అంతా అవాక్కు అవుతారు. ఏంటీ అప్పు నువ్ కూడా అని కల్యాణ్ అంటాడు. మరి లేకుంటే ఎంట్రా. నీలాంటి సరస్వతి పుత్రున్ని పట్టుకుని ఇంతలా అవమానిస్తున్నారు. మట్టి కొట్టుకుపోతారు. ఏరికోరి పెళ్లి చేసుకున్నావ్ కదా. చచ్చేదాక చచ్చినట్లు ఆ పిల్లతోనే ఉండాలి అని అప్పు అంటుంది. అసలు ఎందుకు వచ్చావ్ అని స్వప్న అడుగుతుంది.

రాజ్ బావ కోసం వచ్చాను. కాల్ చేస్తే కలుస్తలేదు. ఇంట్లో లేడా అని అప్పు అడుగుతుంది. లేడని స్వప్న చెబుతుంది. అబ్బ.. ఛ.. అని అప్పు అంటుంది. ఏమైందమ్మా అని ఇందిరాదేవి అడిగితే.. నిజం చెప్పకుండా ఏం లేదు. చిన్న పని పడింది. సరే వస్తాను అని వెళ్లిపోతుంది అప్పు. కానీ, ఇంతలో ఆగమని కోపంగా గట్టిగా అరుస్తుంది అనామిక తల్లి. దాంతో పళ్లు రాలతాయ్ అని అప్పు వార్నింగ్ ఇస్తే అంతా షాక్ అవుతారు. మూసుకుని నీ పని నువ్ చూసుకో అని వెళ్లిపోతుంది అప్పు.

సీతారామయ్య ఆగ్రహం

మీరు కూడా విన్నారు కదా. అప్పు కూడా కల్యాణ్ అనామిక కడదాకా కలిసి ఉండాలనే కోరుకుంటుంది. ఇంకోసారి అప్పు విషయంలో మీ కూతురు గొడవ చేయకూడదు అని సీతారామయ్య అంటాడు. అనామిక మారదు తాతయ్య అని కల్యాణ్ అంటాడు. మార్చుకోవాలిరా. మగాడు అన్నాక భార్యను ఆ మాత్రం అదుపులో పెట్టుకోవాలి అని సీతారామయ్య అంటే మీ ఇద్దరు అర్థం చేసుకోకలేకపోవడవం వల్లే ఈ గొడవలు అని ఇందిరాదేవి అంటుంది.

ఇంకోసారి విడాకులు అనే మాట వస్తే కర్ర విరిగే వరకు కొడతాను. బొమ్మల పెళ్లి అనుకున్నావా. ఆట అయిపోయాక అటకెక్కించడానికి. అపర్ణ వచ్చినవాళ్లకు కాఫీ, టీలు, పలహారాలు ఇచ్చి పంపించు. వస్తే చుట్టపుచూపుగా రండి. లేకుంటే రాకండి. అనామిక మా ఇంటి అమ్మాయి. బంగారంలా చూసుకుంటాం అని అందరిపై కొప్పడి వెళ్లిపోతాడు సీతారామయ్య. మరోవైపు గుండు రౌడీ దగ్గరికి కావ్యను తీసుకెళ్తారు రౌడీలు. కావ్య అరుస్తుంటుంది.

కమిషన్ పెంచాలి

నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చార్రా అని కావ్య అంటే.. నిన్ను అమ్మేయడానికి అని మంగమ్మ అంటుంది. ఈ పిల్ల ఇక్కడ ఎలా దొరికిందిరా అని వాడు అంటే.. నేనే మాయ మాటలు చెప్పి తీసుకొచ్చాను. ఈసారి నా కమిషన్ ఎక్కువ ఇవ్వాలి భైరవ అని అంటుంది మంగమ్మ. బాగానే గిట్టుబాటు అయ్యేలా ఉందని భైరవ అంటే.. రేయ్.. నేను దుగ్గిరాల ఇంటి కోడలిని. మా ఆయనకు తెలిస్తే కుక్క చావు చస్తావ్ అని కావ్య అంటుంది.

నువ్ ఏ ఇంటి కోడలు అయితే నాకేంటీ. ఒక్కసారి ఇక్కడకు వస్తే మూడో కంటికి కూడా తెలియకుండా దేశాన్ని దాటిస్తాం. లోపల పడేయండి అని భైరవ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. లోపల పడేసరికి అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉండటంతో కావ్య షాక్ అవుతుంది. మరోవైపు రాజ్ బావ ఎక్కడికి వెళ్లాడని అప్పు ఇంటి గేటు ముందు ఆలోచిస్తుంటుంది. ఇంతలో రాజ్ కారు వస్తుంది. రాజ్ కారు దిగగానే అక్కను కిడ్నాప్ చేశారని అప్పు చెబుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

రెండు రోజుల్లో

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో అసలు అక్కడికి ఎందుకు వెళ్లిందని రాజ్ అంటే.. మాయ కోసం అని అప్పు చెబుతుంది. కావ్య గురించి పోలీసులతో మాట్లాడుతారు. మీరిచ్చిన వెహికిల్ నెంబర్ ట్రేస్ చేశాం. దాన్ని నడుపుతుంది జేమ్స్. కావ్య మేడమ్‍‌ను రెండు రోజుల్లో పట్టుకోవాలి. లేకుంటే వాళ్లను దుబాయ్‌కు పంపించేస్తారు అని పోలీస్ చెబుతాడు. మరోవైపు కావ్యతోపాటు అందరినీ వ్యాన్ ఎక్కిస్తుంటారు.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024