Best Web Hosting Provider In India 2024
Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో మూవీని అనౌన్స్ చేసి ఏడాది దాటిపోయింది. అనౌన్స్‌మెంట్ మినహా ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ ఇప్పటివరకు రాలేదు.
అయినా సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలుకానుందానని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూవీ టైటిల్ ఫిక్స్!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫుల్ మాసీ రోల్‌లో కనిపించబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ హీరోయిజం, ఎలివేషన్స్ పీక్స్‌లో ఉంటాయని అంటున్నారు. అతడి క్యారెక్టరైజేషన్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే టైటిల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ 31వ సినిమా…
ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 31వ సినిమా ఇది. ఈ భారీ బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
దేవరతో బిజీ…
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరతో పాటు బాలీవుడ్ మూవీ వార్ 2తో బిజీగా ఉన్నాడు. దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. తీర ప్రాంత ప్రజల అస్తిత్వం కోసం పోరాడే నాయకుడిగా ఈ మూవీలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. దేవరలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ మూవీతోనే ఆమె టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. దేవర ఫస్ట్ సింగిల్ మే 19న రిలీజ్ కాబోతోంది. ఈ పాటతోనే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర రిలీజ్ కానుంది. తొలుత ఏప్రిల్ 5న ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదాపడింది.
రెండు పార్ట్‌లు…
దేవర రెండు పార్ట్‌లుగా రూపొందిస్తోన్నట్లు మేకర్స్ ప్రకటించారు. పార్ట్ వన్‌ను దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో కళ్యాణ్‌రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని, హరి కోసరాజు ప్రొడ్యూస్ చేస్తోన్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తోన్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బాలీవుడ్ ఎంట్రీ…
మరోవైపు వార్ 2తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు ఎన్టీఆర్. ఈ స్పై యాక్షన్ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తోన్నాడు. బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వార్ 2 మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను ఎన్టీఆర్ పూర్తిచేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టాపిక్