White Bed Sheets In Railway : రైలు స్లీపర్ కోచ్‌లలో తెల్లని బెడ్‌షీట్‌లనే ఎందుకు ఇస్తారు..

Best Web Hosting Provider In India 2024

రైల్వే.. భారతదేశంలో సుదూర ప్రయాణానికి వెళ్లడానికి ఉపయోగించే సాధారణ మార్గం. రైలులో ప్రయాణిస్తే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. జనరల్ బోగీలలో ప్రయాణిస్తే కొన్నిసార్లు ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఆ ఫీల్ మాత్రం బాగుంటుంది. ఎంత దూరం ప్రయాణించినా అలసిపోకుండా వెళ్తాం. అందుకే చాలా మంది రైలులో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు.

దూర ప్రయాణాల విషయానికి వస్తే ఎక్కువ మంది స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటారు. ఇందులో అయితే ఎంచక్కా దర్జాగా పడుకుని వెళ్లవచ్చు. స్లీపర్‌లో ఎక్కితే మనకు బెడ్‌షీట్లు, దిండ్లు వంటి సేవలు కూడా ఉంటాయి. ఇలాంటి రైల్వే సేవలను మనం ఉపయోగించాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదో ఒక సమయంలో మనలో చాలామంది భారతీయ రైల్వేలోని ఏసీ కంపార్ట్‌మెంట్లలో బెడ్ కోసం అందించిన దుప్పట్లను ఉపయోగించే ఉంటారు. ఇవి చూసేందుకు మెరుస్తూ తెల్లగా ఉంటాయి.

ఈ బెడ్ షీట్స్, పిల్లోలు రోజూ కడిగి రైలులోని ప్రతి ప్రయాణికుడికి తాజాగా ఇస్తారు. మీకు అందించిన బెడ్ షీట్లు, దిండు కవర్లు ఎప్పుడూ తెల్లగా ఉండటాన్ని మీరు గమనించారా? భారతీయ రైల్వేలు ఎల్లప్పుడూ మీ ప్రయాణం కోసం తెల్లటి బెడ్ షీట్‌లు, దిండులను అందజేస్తాయి.

అయితే ఇలా ఇవ్వడం సాధారణమే అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ దీని వెనక ఇండియన్ రైల్వేల ప్రణాళికాబద్ధమైన వ్యూహం ఉంది. దాని వెనుక ఉన్న కారణాన్ని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. భారతీయ రైల్వేలు ప్రతిరోజూ అనేక సంఖ్యలో రైళ్లను నడుపుతున్నాయి. ప్రతిరోజూ అనేక వేల బెడ్‌షీట్లు, దిండులు అవసరం. ఇవి కంపార్ట్‌మెంట్లలో ప్రయాణీకులకు అందిస్తారు. ఒక్కసారి వాడిన తర్వాత వెంటనే శుభ్రం చేసేందుకు పంపిస్తారు. శుభ్రపరిచే ప్రక్రియలో 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి బాయిలర్లలో వేస్తారు. దీనికోసం ప్రత్యేక యంత్రాలు ఉంటాయి. బెడ్‌షీట్‌లు 30 నిమిషాల పాటు ఈ ఆవిరికి లోబడి ఉంటాయి. అవి పూర్తిగా క్రిమిరహితంగా మారుతాయి.

ఈ శుభ్రపరిచే ప్రక్రియలో భాగంగా భారతీయ రైల్వే తెల్లటి బెడ్ షీట్‌లను ఎంపిక చేసింది. కఠినమైన వాషింగ్ పరిస్థితులకు వైట్ బెడ్‌షీట్‌లు అనుకూలంగా ఉంటాయి. పరిశుభ్రతను కాపాడుకోవడానికి అవసరం. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన డిటర్జెంట్‌లకు గురికావడం వలన వేరే రంగు బట్టలు రంగును కోల్పోతాయి. మళ్లీ పాతవాటిలాగా అనిపిస్తాయి. రంగు రంగుల బట్టలను అంతటి ఉష్ణోగ్రత వద్ద మరిగిస్తే.. వాటి రంగు ఇతర రంగు వాటికి అంటుకుంటుంది. అందుకే వైట్ బెడ్ షీట్స్ అయితే ఆ సమస్య ఉండదు. తెల్లటి బెడ్ షీట్‌లను సమర్థవంతంగా బ్లీచ్ చేయవచ్చు. వాటిని తలతల మెరిసేలా కొత్తవాటిలా చేసుకోవచ్చు. పదేపదే ఉతికినప్పటికీ ఫాబ్రిక్ శుభ్రమైన, మెరిసే రూపాన్ని ఇస్తుంది. తెల్లటి బెడ్‌షీట్‌లను ఇవ్వడం ద్వారా ప్రయాణీకులకు శుభ్రమైనవని అందించడమే కాకుండా.. చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.

వివిధ రంగుల బెడ్ షీట్లను ఉపయోగిస్తే.. శుభ్రం చేసేప్పుడు వేడి ఉష్ణోగ్రత వద్ద వాటి రంగులు పోతాయి. ఒకదానితో ఒకటి అంటుకుంటాయి. అప్పుడు చూసేందుకు బాగుండదు. వివిధ రంగుల బెడ్ షీట్లను ఉపయోగిస్తే వాష్ చేసేప్పుడు వేరే రంగువాటితో కలపకూడదు. వాటిని విడిగా కడగాలి. ఈ కారణంగానే భారతీయ రైల్వేలు ప్రయాణికుల వినియోగానికి తెల్లటి బెడ్‌షీట్‌లను ఉత్తమమైనవిగా పరిగణిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? భారతీయ రైల్వే తెల్లని బెడ్‌‌షీట్స్, దిండులను ఎందుకు ఉపయోగిస్తుందని.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024