Best Web Hosting Provider In India 2024
Anushka అనుష్కను టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో నిలబెట్టిన సినిమాల్లో అరుంధతి ఒకటి. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. పదమూడు కోట్ట బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
టాలీవుడ్లో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. అరుంధతి రిలీజై పదిహేనేళ్లు అయినా ఈ మూవీ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
గ్లామర్ పాత్రల్లోనే అనుష్క…
ఈ సినిమాలో అరుంధతిగా, జేజమ్మగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్లో అనుష్క అసమాన నటనతో అదరగొట్టింది. అరుంధతికి ముందు ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది అనుష్క.
అరుంధతి మూవీతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఓవర్‌నైట్‌లోనే అనుష్కకు ఈ మూవీ సూపర్ స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. అనుష్కలోని అసలైన యాక్టింగ్ కోణాన్ని అరుంధతి వెలికితీసింది. ఈ మూవీతో టాలీవుడ్లో పవర్ఫుల్ రోల్స్‌తో కూడి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు అనుష్క కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
మమతా మోహన్‌దాస్ చేయాల్సింది…
అయితే ఈ మూవీలో అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లను దర్శకనిర్మాతలు అనుకున్నారు. చివరకుఅరుంధతిలో హీరోయిన్గా మమతా మోహన్‌దాస్‌ను ఫిక్స్చేశారు. ఈ మూవీతోనే మమతా మోహన్‌దాస్ ను టాలీవుడ్‌కు పరిచయం చేయాలని అనుకున్నారు.
ఈ సినిమా చేయడానికి తొలుత అంగీకరించిన మమతా మోహన్‌దాస్ ఆ తర్వాత రిజెక్ట్చేశారు. తెలుగు ఇండస్ట్రీపై సరైన అవగాహన లేకపోవడంతో అరుంధతిని వదులుకున్నారు. డైరెక్టర్‌తో పాటు ప్రొడక్షన్ హౌజ్ గురించి ఓ మేనేజర్ చెప్పిన మాటలు నమ్మి ఈ సినిమాను వదలుకొని పెద్ద తప్పుచేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో మమతా మోహన్‌దాస్ చెప్పింది.
అనుష్క కెరీర్ మలుపు తిరిగింది…
మమతా మోహన్‌దాస్ సినిమాను రిజెక్ట్ చేయడంలో ఆమె స్థానంలో అనుష్కను హీరోయిన్గా తీసుకున్నారు. మమతా మోహన్‌దాస్ వదులుకున్న ఈ మూవీ అనుష్క కెరీర్‌ను మలుపుతిప్పింది.
నాలుగేళ్లలో రెండు సినిమాలు…
గత కొన్నాళ్లుగా సినిమాల వేగాన్ని తగ్గించింది అనుష్క. గత నాలుగేళ్లలో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసింది. అనుష్క హీరోయిన్గా గత ఏడాది రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. సరోగసీ కాన్సెప్ట్‌కు కామెడీ జోడించి రూపొందించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టిహీరోగా నటించాడు.
తెలుగులో ఘాటి…
ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే మూవీ చేస్తోంది అనుష్క. పీరియాడికల్ స్టోరీతో ప్రయోగాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఘాటి మూవీ ఓటీటీ రైట్స్ షూటింగ్ పూర్తికాకముందే అమ్ముడుపోయాయి. రికార్డ్ ధరకు అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీలో హక్కులను సొంతం చేసుకున్నది. ఈ ఏడాదే అనుష్క మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఫాంటసీ హారర్ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తోన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో అనుష్క బిజీగా ఉంది.