Best Web Hosting Provider In India 2024
Yuvaraj OTT: కాంతార ఫేమ్ సప్తమిగౌడ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ యువరాజ్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లను స్కిప్ చేస్తూ ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందిన యువరాజ్ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ మూవీ యువ డబ్బింగ్ వెర్షన్‌గా యువరాజ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
యువరాజ్‌కుమార్ ఎంట్రీ…
యువ సినిమాతో రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి యువరాజ్‌కుమార్ హీరోగా సాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ అన్నయ్య అయిన రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడే యువరాజ్‌కుమార్. యువ సినిమాను కన్నడంలో హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. సంతోష్ ఆనంద్‌రామ్ ఈమూవీకి దర్శకత్వం వహించాడు. దర్శకత్వం వహించాడు
కన్నడంలో థియేటర్లు…తెలుగులో ఓటీటీ…
యువ కన్నడ వెర్షన్ మార్చి 29న థియేటర్ల రిలీజైంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో కన్నడంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి యువ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడంతో కేవలం కన్నడంలోనే సినిమా రిలీజైంది. మిగిలిన భాషల్లో డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా యువ ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి…
కన్నడంలో కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. యువ కన్నడ వెర్షన్ ఏప్రిల్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం నెల రోజుల ఆలస్యంగా మే 17న ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.
యువ కథ ఇదే…
యువరాజ్ (యువరాజ్‌కుమార్) ఓ రెజ్లర్, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై రెజ్లింగ్ నుంచి నిషేధం విధిస్తారు. దోషిగా ముద్రపడ్డ యువను అతడి తండ్రి కూడా ద్వేషిస్తుంటాడు. రెజ్లింగ్‌కు దూరమైన యువ ఇంజినీరింగ్ పూర్తిచేస్తాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఫుడ్ డెలివరీబాయ్‌గా పనిచేస్తుంటాడు. స్టాక్ మార్కెట్ బిజినెస్ పేరుతో యువ తండ్రిని కొందరు మోసం చేస్తారు.
అప్పుల్లో కూరుకుపోయిన తండ్రిని కాపాడటానికి యువ ఆ మోసగాళ్లతో ఎలాంటి పోరాటం చేశాడు? యువ నిజంగానే రెజ్లింగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడా? అతడిపై ఈ ఆరోపణలు చేసింది ఎవరు? కష్టాల కడలి నుంచి బయటపడేందుకు యువకు సిరి ఎలాంటి సాయం చేసింది అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో యువరాజ్‌కుమార్, సప్తమి గౌడ నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి.
కాంతార తర్వాత…
కాంతార తర్వాత కన్నడంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన మూవీ ఇది. కాంతారలో గ్లామర్ హంగులకు దూరంగా అణిచివేతకు గురైన ఓ వర్గానికి అండగా నిలబడే ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో సప్తమి గౌడ కనిపించింది. యువరాజ్‌లో ఆధునిక అమ్మాయిగా కనిపించింది.
నితిన్ తమ్ముడులో హీారోయిన్…
ఈ ఏడాదే సప్తమి గౌడతెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ ఏడాదే తమ్ముడు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
టాపిక్