
మంత్రి అమర్నాథ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేసిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సహధర్మచారిణి. చంద్రబాబు వెనుక ఐదు కోట్ల మంది ఉంటే కుప్పం మున్సిపాలిటీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది. చంద్రబాబు ఉడత బెదిరింపులకు మా కార్యకర్త కూడా భయపడడు.
వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకే పొత్తుల కోసం పవన్ వెంపర్లాట. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే. మళ్లీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న భాష సరిగా లేదు అంటూ మండిపడ్డారు.