Best Web Hosting Provider In India 2024
Anantapur Road Accident : కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదం అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది.
శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాథమిక వివరాల ప్రకారం….అనంతపురం రాణినగర్‌కు చెందిన ఓ కుటుంబం పెళ్లి షాపింగ్‌కు కోసం కారులో హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో అతివేగం కారణంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఇదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ… కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
అలీ సాహెబ్ (58), షేక్ సిరాజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమన్ (4), రెహానా బేగం (40)ను మృతులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వేడుకకు సిద్ధమవుతున్న వేళ ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు చనిపోగా… కుటుంబం సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోవటం అతిపెద్ద విషాదంగా మారింది.
టాపిక్