Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Best Web Hosting Provider In India 2024

Mango Pakodi: వేసవిలో మాత్రమే పచ్చి మామిడికాయలు దొరుకుతాయి. సీజనల్‌గా దొరికే వీటితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇక్కడ మేము పచ్చి మామిడికాయ పకోడీని ఎలా చేయాలో చెప్పాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లపుల్లగా పిల్లలకు నచ్చేలా ఉంటుంది. ఒకసారి దీన్ని చేసుకొని చూడండి. మీకు నచ్చడం ఖాయం.

పచ్చి మామిడికాయ పకోడీ రెసిపీ

పచ్చి మామిడికాయ – ఒకటి

శెనగపిండి – ఒక కప్పు

కొత్తిమీర తరుగు – నాలుగు స్పూన్లు

కారం – అర స్పూను

పసుపు – పావు స్పూను

జీలకర్ర – ఒక స్పూను

నూనె – వేయించడానికి సరిపడా

ఉప్పు – రుచికి సరిపడా

పచ్చి మామిడికాయ పకోడీ రెసిపీ

1. ఒక గిన్నెలో మామిడికాయను చాలా సన్నగా తురుము కావాలి.

2. ఆ గిన్నెలోనే శెనగపిండి, పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

3. అవసరమైతే కాస్త నీళ్లు చల్లుకోవాలి.

4. పకోడీకి ఎంత జారుడుగా పిండి కావాలో అంత మందంగా చేసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. నూనె వేడెక్కాక మామిడి తురుము మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.

7. అంతే టేస్టీ పచ్చి మామిడి పకోడీ రెడీ అవుతుంది.

8. ఇది పుల్లపుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుంది.

9. పిల్లలకు ఇది నచ్చడం ఖాయం. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.

పచ్చి మామిడికాయలు కేవలం వేసవికాలంలోనే లభిస్తాయి. కాబట్టి వీటిని కచ్చితంగా ఆయా సీజన్లలో తినాలి. వ్యాధులను తట్టుకునే శక్తి పచ్చి మామిడి కాయలు అందిస్తాయి. వీటితో పకోడీలు, బోండాలు, గారెలు వంటివి చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్స్ గా ఇవి ఉపయోగపడతాయి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024