Best Web Hosting Provider In India 2024
Nagababu: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇటీవల దుమారం రేపింది. సోషల్ మీడియాలో మెగా, అల్లు అభిమానుల మధ్య రచ్చకు కారణమైంది. ఆ ట్వీట్‍ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍ను ఉద్దేశించే చేశారని నాగబాబుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ శుక్రవారం డియాక్టివేట్ అయింది. అయితే, ఆయన ఎక్స్ అకౌంట్ నేడు (మే 18) మళ్లీ యాక్టివ్ అయింది. ఆ ట్వీట్ డిలీట్ చేశానంటూ కూడా మరో పోస్ట్ చేశారు నాగబాబు.
ట్వీట్ రచ్చ ఇదే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు మెగా కుటుంబమంతా మద్దతుగా నిలిచింది. ఆ పార్టీ నేతగానూ నాగబాబు ఉన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్‍కు మెగా హీరోలంతా మద్దతు తెలిపారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. దీంతో తన మామయ్య పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్న వైసీపీకి చెందిన అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఆ తరుణంలో నాగబాబు ఓ ట్వీట్ చేశారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు.. మా వాడైనా పరాయివాడే – మాతో నిలబడే వాడు.. పరాయివాడైనా మాడే” అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. అల్లు అర్జున్‍ను ఉద్దేశించే నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. స్నేహం కోసమే వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతునిచ్చానని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చినా.. నాగబాబు ఇలాంటి ట్వీట్ చేయడం సరికాదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగబాబు చేసిన ట్వీట్ ఏకంగా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అనే రేంజ్‍కు వెళ్లిపోయింది. ఎప్పుడూ కలిసే ఉండే మెగా, అల్లు అభిమానులు కొందరు సోషల్ మీడియా వేదికగా మీమ్స్‌తో ట్రోల్స్ చేసే స్థాయికి వెళ్లింది. ఈ విషయం పెద్ద రచ్చగా మారింది. నాగబాబు కొందరు విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో మోత ఎక్కువయ్యే సరికి ఎక్స్ అకౌంట్‍ను కొన్ని గంటలు డీయాక్టివేట్ చేసి.. మళ్లీ ఇప్పుడు యాక్టివేట్ చేశారు నాగబాబు.
నా ట్వీట్ డిలీట్ చేశా..
వివాదానికి కారణమైన ఆ ట్వీట్‍ను నాగబాబు డిలీట్ చేశారు. అకౌంట్ రీయాక్టివేట్ చేశాక ఆ విషయంపై పోస్ట్ చేశారు. “నా ట్వీట్‍ను డిలీట్ చేశా” అని పోస్ట్ చేశారు.
ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజున (మే 11) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నంద్యాల వెళ్లారు. నంద్యాల అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడికి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చాయి. తనకు పార్టీలతో సంబంధం లేదని, స్నేహితుడి కోసమే నంద్యాల వచ్చానని అల్లు అర్జున్ అప్పుడే చెప్పారు. పోలింగ్ రోజు కూడా ఇదే విధంగా క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‍కు మద్దతుగా ట్వీట్ కూడా చేశారు అల్లు అర్జున్.