Balakrishna: బాలయ్య – అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. స్క్రిప్ట్, టైటిల్ ఫిక్స్ అయినా పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Best Web Hosting Provider In India 2024

Balakrishna – Amitabh Bachchan: సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు క్రేజీ కాంబినేషన్లు కాస్తలో మిస్ అవుతుంటాయి. ఎంతో క్యూరియాసిటీ పెంచిన కొన్ని చిత్రాలు పట్టాలెక్కకుండానే ఆగిపోతుంటాయి. ఈ జాబితాలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ చేయాల్సిన ఓ మూవీ కూడా ఉంది. ఆ చిత్రానికి బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఓకే చెప్పారు. దీంతో బాలయ్య – అమితాబ్ కాంబినేషన్‍ ఫిక్స్ అయింది. అయితే, ఈ సినిమా షూటింగ్‍ దశకు రాకుండానే ఆగిపోయింది. దీంతో ఈ క్రేజ్ కాంబినేషన్ తెరకెక్కలేదు. ఆ వివరాలివే..

100వ సినిమాగా అనుకున్నా!

‘రైతు’ అనే సినిమా కథ బాలకృష్ణకు నచ్చటంతో ఈ మూవీని తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు కృష్ణవంశీకి అప్పగించారు. ఈ స్క్రిప్ట్‌కు కృష్ణవంశీ మార్పులు కూడా చేశారు. రైతు మూవీని తన వందో చిత్రంగా చేయాలని 2012లోనే బాలయ్య ప్లాన్ చేశారు. అయితే, ఆ సమయంలోనే దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి (2017) స్క్రిప్ట్ బాలకృష్ణకు బాగా నచ్చేసింది. దీంతో దాన్నే 100వ సినిమాగా చేశారు. ఆ తర్వాత రైతు మూవీని మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నాలు చేశారు.

ప్రాజెక్ట్‌లోకి అమితాబ్

రైతు స్క్రిప్ట్‌కు కృష్ణ వంశీ మార్పులు చేశారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్‍ను కీలకపాత్రకు అనుకున్నారు. అమితాబ్‍కు కృష్ణ వంశీ స్టోరీ చెప్పారు. ఆయన పాత్ర మరింత ఎక్కువగా ఉండేలా కూడా స్క్రిప్ట్‌లో ఛేంజెస్ చేశారు. దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించాలనుకున్నారు.

పట్టాలెక్కని మూవీ

రైతు మూవీలో కీలకపాత్ర చేసేందుకు అమితాబ్ బచ్చన్ అంగీకరించారని రైతు సినిమా నుంచి చివరగా అప్‍డేట్ బయటికి వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం నిలిచిపోయింది. ఏ మాత్రం ముందుకు సాగలేదు. అక్కడితోనే ఆగిపోయింది. షూటింగ్ పట్టాలెక్కలేదు. దీంతో ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టకుండానే తెరపడిపోయింది.

రైతు మూవీని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వీ ఆనంద్ ప్రసాద్ నిర్మించాల్సి ఉంది. అయితే, ఈ సినిమా ఎందుకు నిలిచిపోయిందో స్పష్టమైన ప్రకటన రాలేదు. బాలయ్య కూడా ఎక్కుడా ఈ మూవీ ఊసెత్తలేదు. ఇతర సినిమాల్లో బిజీ అయ్యారు. దీంతో రైతు చిత్రం ట్రాక్ ఎక్కలేదు. దీంతో బాలకృష్ణ – అమితాబ్ కాంబినేషన్ మిస్ అయింది.

అయితే, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ కార్యరూపం దాల్చింది. చిరూ ప్రధాన పాత్ర పోషించిన సైరా నరసింహా రెడ్డి చిత్రంలో బిగ్‍బీ కీలకపాత్ర చేశారు. నరహింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్ర చేశారు అమితాబ్.

బాలయ్య ప్రస్తుతం..

గతేడాది 2023లో భగవంత్ కేసరి మూవీతో బాలకృష్ణ సూపర్ హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా (NBK 109) చేస్తున్నారు బాలయ్య. పాన్ ఇండియా రేంజ్‍‍లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల ఎన్నికల సందర్భంగా షూటింగ్‍కు కాస్త బ్రేక్ ఇచ్చారు. అతిత్వరలో మళ్లీ షూటింగ్ మొదలుకానుంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ఈ మూవీలో కీలకపాత్రలు చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలు నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024