TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం – ఆగస్టు 28 నుంచి పరీక్షలు

Best Web Hosting Provider In India 2024

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ – 2024 ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 2వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

TS SET 2024 step guide to apply – సెట్ కు ఇలా అప్లయ్ చేసుకోండి

  • అర్హత కలిగిన అభ్యర్థులు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
  • హోంపేజీలో కనిపించే ‘Apply Online’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండో లో మీ వివరాలను ఎంట్రీ చేయాలి. చివరగా కనిపించే Continue ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ కావాల్సిన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత నిర్ణయించిన దరఖాస్తు రుసుంను చెల్లించాలి.
  • ఫైనల్ గా సబ్మిట్ ఆప్షన్ పై నొక్కితే మీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది.

దరఖాస్తు రుసుం :

  • ఓసీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాలి.
  • బీసీ అభ్యర్థులు రూ. 1500 చెల్లించాలి.
  • SC, STలతో పాటు దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ – 2024(Telangana State Eligibility Test Exam) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(OU) నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.

 
 

Open PDF in New Window

ఆగస్టు 28 నుంచి పరీక్షలు…

ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఆగస్టు 31వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయని తెలంగాణ సెట్ అధికారులు వెల్లడించారు. http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో(TS SET Exam 2024) నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉంటాయి. ఇక పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష నిర్వహిస్తారు.

ముఖ్య వివరాలు:

  • తెలంగాణ సెట్ పరీక్షలో జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ -పేపర్ 1 గా ఉంటుంది.
  • పేపర్ – 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.
  • వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.
  • కంప్యూటర్‌ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి.
  • పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.
  • పరీక్ష వ్యవధి మూడు గంటలు.
  • ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
  • ఈ పేపర్‌ 2 లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.
  • ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • తెలంగాణ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ : http://www.telanganaset.org/ 

 

 
IPL_Entry_Point
 

టాపిక్

 
Telangana NewsTrending TelanganaEducationAp Set
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024