Silk Saree Movie: సీరియల్ నటుడు హీరోగా మూవీ.. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీగా సిల్క్ శారీ

Best Web Hosting Provider In India 2024

Actor Vasudev Rao Silk Saree: బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వాసుదేవ్ రావు. రామా సీతా, జానకి కలగనలేదు వంటి ఎన్నో సీరియళ్లలో తనదైన మార్క్‌తో అలరించాడు. ఇప్పుడు వాసుదేవ్ రావు హీరోగా మారిన సినిమా సిల్క్ శారీ. ఇందులో రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. “సిల్క్ శారీ” సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

“సిల్క్ శారీ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వాసుదేవ్‌కు ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా ప్రయత్నం చేసే ప్రతి సినిమాకు మన తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుంది. అది చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. దర్శకుడు నాగేందర్, నిర్మాత కమలేష్, ఇతర టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా” అని హీరో శ్రీకాంత్ తెలిపారు.

“హీరో శ్రీకాంత్ గారు మా ఈ‌వెంట్‌కు రావడం హ్యాపీగా ఉంది. ఆయన నేను కలిసి ఖడ్గం సినిమాలో నటించాం. ఆ సినిమా నాకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన గెస్ట్‌గా వచ్చి బ్లెస్ చేసిన మా సిల్క్ శారీ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు ఈ సినిమాతో మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత కమలేష్, దర్శకుడు నాగేందర్‌కు థ్యాంక్స్ చెబుతున్నా” అని హీరో వాసుదేవ్ రావు పేర్కొన్నారు.

“సిల్క్ శారీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన పెద్దలు మురళి మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మూవీతో టాలీవుడ్‌లోకి నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇకపైనా మా చాహత్ బ్యానర్‌పై రెగ్యులర్‌గా సినిమాలు రూపొందిస్తాం. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 24న థియేటర్స్‌లోకి వస్తున్న మా సిల్క్ శారీ సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అని నిర్మాత కమలేష్ కుమార్ అన్నారు.

“సిల్క్ శారీ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదొక సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. హీరో వాసుదేవ్ రావు కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ప్రొడ్యూసర్‌గా కమలేష్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ సహకారంతో సినిమాను ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. థియేటర్స్‌కు వచ్చి మా మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా” అని డైరెక్టర్ టి. నాగేందర్ చెప్పుకొచ్చారు.

 
IPL_Entry_Point
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024